Breaking News

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే భయమేస్తోంది: హీరో నాని కామెంట్స్

Published on Tue, 08/27/2024 - 16:09

టాలీవుడ్ హీరో నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అంటూ టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్నారు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన అంటే సుందరానికీ చిత్రం హిట్‌టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం నాని సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాని మలయాళ ఇండస్ట్రీలో కలకలం సృష్టించిన హేమ కమిటీ నివేదికపై స్పందించారు. అంతే కాకుండా అలాగే కోల్‌కతా వైద్యవిద్యార్థినిపై జరిగిన దారుణ ఘటన తనను కలిచివేసిందన్నారు.

నాని మాట్లాడుతూ..' ఢిల్లీ నిర్భయ ఘటన తలుచుకుంటే ఇప్పటికీ నన్ను బాధిస్తోంది. మహిళలపై జరుగుతున్న దారుణాలు నిరంతరం కలవరపెడుతున్నాయి. కోల్‌కతాలో వైద్యవిద్యార్థిని సంఘటన నన్ను కలచివేసింది. మొబైల్‌ను స్క్రోలింగ్ చేయాలంటే భయంగా ఉంది. సోషల్ మీడియాలో ఎలాంటి వార్త చూడాల్సి వస్తుందో అన్న భయమేస్తోంది.  హేమకమిటీ నివేదిక చూసి నేను షాకయ్యా. మహిళలపై లైంగిక వేధింపులు చూస్తుంటే ఎంత దారుణమైన స్థితిలో బతుకుతున్నామో అర్థమవుతోంది. తన సెట్స్‌లో ఇలాంటి సంఘటనలు జరగడం తానెప్పుడూ చూడలేదు. 20 సంవత్సరాల క్రితం పరిస్థితి మెరుగ్గా ఉండేది. అప్పటి రోజుల్లో మహిళలకు రక్షణ ఉండేది. ఇప్పటి పరిస్థితులు తలచుకుంటేనే చాలా దారుణంగా ఉందనిపిస్తోంది' అని అన్నారు. కాగా..నాని, ప్రియాంక మోహన్ జంటగా నటించిన సరిపోదా శనివారం ఈనెల 29న థియేటర్లలో సందడి చేయనుంది. 

 

Videos

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)