Breaking News

పరువు నష్టం కేసు.. మంత్రిపై క్రిమినల్‌ చర్యలకు డిమాండ్‌!

Published on Thu, 11/21/2024 - 14:53

తెలంగాణ మంత్రి కొండా సురేఖ టాలీవుడ్ హీరో  నాగార్జునపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అక్కినేని నాగార్జున మంత్రిపై పరువునష్టం దావా వేశారు. తాజాగా ఈ కేసులో నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా కొండా సురేఖ ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్‌ను నాగార్జున తరఫున న్యాయవాది అశోక్ రెడ్డి   కోర్టు ముందు చదువు వినిపించారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం సరైంది కాదని.. కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలని ఆయన వాదించారు. ఇలాంటి కామెంట్స్ వల్ల నాగార్జున కుటుంబ సభ్యులు మానసికంగా ఎంతో కుంగిపోయారని న్యాయమూర్తికి విన్నవించారు.

కొండాసురేఖ లాయర్ వేసిన కౌంటర్‌పై నాగార్జున తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.  కొండ సురేఖ మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని.. నాగార్జున ఫ్యామిలీని కించ పరిచేలా ఆమె వ్యాఖ్యలు చేశారని అన్నారు. కొండ సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా.. ఇప్పటికే ఈ కేసులో నాగార్జున,  ఆయన కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది.

‍ట్విటర్‌లో క్షమాపణలు..

అయితే తన కామెంట్స్‌పై మంత్రి కొండా సురేఖ ట్విట్టర్ ద్వారా క్షమాపణలు కోరిన సంగతి తెలిసిందే. ఆ పోస్ట్‌ను కూడా  కోర్టు ముందు నాగార్జున తరుపు న్యాయవాది అశోక్ రెడ్డి చదివి వినిపించారు. నాగార్జున కుటుంబంపై మంత్రి చేసిన కామెంట్స్‌ తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దీంతో వెంటనే మంత్రి సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు కోరింది. 'నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ.. మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే  బేషరతుగా  నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నా.. అన్యద భావించవద్దు' అంటూ కొండా సురేఖ ట్విట్ చేసింది.

నాగార్జున పరువు నష్ట దావా కేసులో కోర్టులో ముగిసిన వాదనలు

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)