Breaking News

ఆర్ఆర్‌ఆర్‌ టైమ్‌లో లేదు.. అందుకే పుష్ప-2తో ప్రారంభిస్తున్నాం: నాగార్జున

Published on Fri, 11/22/2024 - 17:07

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున టెక్నాలజీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. మనదేశంలో డాల్బీ విజన్ సాంకేతికతను తొలిసారి అన్నపూర్ణ స్టూడియో ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సదుపాయం ఇప్పటివరకు ఇండియాలో ఎక్కడా కూడా లేదన్నారు.

గతంలో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు డాల్బీ విజన్‌ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడంతో జర్మనీకి వెళ్లారని అన్నారు. అ‍క్కడే సినిమాకు సంబంధించిన పనులు పూర్తి చేశారని నాగ్ వెల్లడించారు. ప్రస్తుతం గోవాలో  జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్ ఇండియా సదస్సులో పాల్గొన్న నాగార్జున సినిమా, థియేటర్ టెక్నాలజీపై మాట్లాడారు.

మొట్ట మొదటిసారి ఈ సదుపాయాన్నిఅన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అల్లు అర్జున్‌ నటించిన పుష్ప-2 మూవీతో ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నామని నాగార్జున తెలిపారు. మనదేశంలో తొలిసారి అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. సినిమా ప్రమాణాలు పెంచి ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని అందించేందుకు ఈ డాల్బీ విజన్‌ సాంకేతికతను వినియోగించనున్నారు. కాగా.. గోవాలో జరుగుతున్న ఐఎఫ్ఎఫ్‌ఐ-2024 ఈవెంట్‌ ఈనెల 28 వరకు కొనసాగనుంది.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)