Breaking News

పోలీసులకు ఫిర్యాదు చేసిన టాలీవుడ్ హీరో మంచు మనోజ్

Published on Mon, 12/09/2024 - 19:30

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం జరిదగిన దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు ఆయన స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. తనపై జరిగిన దాడిపై పహాడీ షరీఫ్ పోలీసులను ఆశ్రయించారు. 

కాగా.. అంతకుముందు ఆదివారం మంచు మనోజ్ బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. తన కాలికి గాయం కావడంతో భార్యతో కలిసి ఆస్పత్రికి వచ్చారు. చికిత్స  అనంతరం ఆస్పత్రి డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తనపై దాడి జరిగిన ఘటనపై ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ దాడి ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రాణహాని ఉంది.. మంచు మనోజ్

అయితే మంచు మనోజ్ తన కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయలేదు.  తన తండ్రి మోహన్‌ బాబు పేరు కూడా ఫిర్యాదులో ప్రస్తావించలేదు.  తన కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో మంచు మనోజ్ పేర్కొన్నారు. తాను ఇంట్లో ఉండగా పదిమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వచ్చి తమపై దాడి చేశారు అని ఫిర్యాదులో వెల్లడించారు. వారిని పట్టుకునే ప్రయత్నంలో తనకు గాయాలైనట్లు పోలీసులకు తెలిపారు.

కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయలేదు..పహాడీ షరీఫ్ సీఐ గురువారెడ్డి

అయితే మంచు మనోజ్ తన కుటుంబ సభ్యులపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సీఐ గురువారెడ్డి వెల్లడించారు. డయల్ 100కు కాల్ రావడంతో తాము ఘటనాస్థలికి వెళ్లామని పహాడీ షరీఫ్ సీఐ తెలిపారు. ఘటనా స్థలంలో విజయ్ రెడ్డి, కిరణ్ అనే వ్యక్తులు సీసీ ఫుటేజ్ కూడా మాయం చేశారని.. ఈ ఘటనపై పూర్తిస్తాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గురువారెడ్డి పేర్కొన్నారు.

 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)