Breaking News

'ఈ ఒక్క ఏడాదే మిస్సవుతున్నా'.. తనయుడికి టాలీవుడ్ ప్రిన్స్ విషెస్

Published on Sun, 08/31/2025 - 09:51

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు తన కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు 20వ వసంతంలోకి అడుగుపెడుతున్న గౌతమ్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. ఈ ఏడాది నీ పుట్టినరోజును మిస్సవుతున్నా అంటూ పోస్ట్ చేశారు. నీ ప్రతి అడుగులో నా ప్రేమ ఉంటుందని ట్విటర్‌లో రాసుకొచ్చారు. నువ్వు చేసే ఏ పనిలోనైనా ఎల్లప్పుడూ నువ్వే అతిపెద్ద చీర్ లీడర్‌.. ఎప్పటికీ ఇలాగే ఎదుగుతూ ఉండాలని కోరుకుంటున్నా అంటూ గౌతమ్‌లో చిన్నప్పటి ఫోటోను షేర్ చేస్తూ తనయుడిపై ప్రేమను చాటుకున్నారు. ఇది చూసిన అభిమానులు సైతం గౌతమ్‌కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

మహేశ్ తన ట్వీట్‌లో రాస్తూ.. '19 ఏళ్ల నా కుమారుడు.. ప్రతి సంవత్సరం నన్ను కొంచెం ఎక్కువగానే ఆశ్చర్యపరుస్తున్నావ్. ఈ సంవత్సరం నీ పుట్టినరోజు మిస్ అవుతున్నా. నా ప్రేమ నీ ప్రతి అడుగులోనూ ఎప్పటికీ నీతోనే ఉంటుంది. నువ్వు చేసే ఏ పనిలోనైనా ఎల్లప్పుడూ నువ్వే అతిపెద్ద చీర్ లీడర్... ఎప్పటికీ ఇలాగే ప్రకాశిస్తూ, ఎదుగుతూ ఉండు' అంటూ పోస్ట్ చేశారు.

కాగా.. మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళితో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో తొలిసారిగా యాక్షన్ అడ్వెంచరస్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కనిపించనుంది. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ షూటింగ్ ఒడిశాలో పూర్తి చేసుకుంది. ఈ మూవీ కోసం మహేశ్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)