Breaking News

మాట నిలబెట్టుకున్న టాలీవుడ్ హీరో.. చెప్పిన పని చేశాడు!

Published on Fri, 10/18/2024 - 21:09

టాలీవుడ్ యంగ్ హీరో ప్రస్తుతం క మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. 1970వ దశకంలోని విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రానికి సుజీత్, సందీప్‌ దర్శకత్వం వహించారు. ఇందులో నయన్‌ సారిక, తన్వీ రామ్‌ హీరోయిన్లుగా నటించారు ఈ సినిమాని దీపావళి సందర్భంగా ఈ నెల 31న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో రిలీజ్‌ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు.

అయితే కిరణ్ ఇటీవల లవ్ రెడ్డి అనే మూవీ ప్రీ రిలీజ్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానుల కోసం లవ్ రెడ్డి మూవీ షోలు ఉచితంగా వేస్తానని అభిమానులకు మాటిచ్చారు. అనుకున్నట్లుగానే ఇవాళ నాలుగు థియేటర్లలో లవ్ రెడ్డి సినిమా ఫ్రీ షోలు ప్రదర్శించారు.  హైదరాబాద్ జీపీఆర్ మల్టిప్లెక్స్, వైజాగ్ శ్రీరామా థియేటర్ , తిరుపతిలో కృష్ణ తేజ థియేటర్, విజయవాడ స్వర్ణ మల్టిప్లెక్స్ ఉచితంగా సినిమాను వేశారు. ఈ సందర్భంగా లవ్ రెడ్డి మూవీ టీమ్ హీరో కిరణ్ అబ్బవరంకు కృతజ్ఞతలు తెలిపింది.  మంచి సినిమాకు సపోర్ట్ గా నిలబడినందుకు ప్రశంసలు కురిపించింది.

కాగా.. గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్  బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం "లవ్ రెడ్డి". ఈ సినిమాలో అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించారు. దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ రోజు థియేటర్స్‌లోకి వచ్చిన లవ్ రెడ్డి ఎమోషనల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ అందుకుంటోంది. 
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)