దేవర ప్రమోషన్లతో బిజీగా జూనియర్ ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

Published on Tue, 02/25/2025 - 13:10

జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్‌ మూవీ దేవర పార్ట్-1.  గతేడాది దసరా ముందు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్ కావడంతో దేవర-2 కూడా ఉంటుందని డైరెక్టర్‌ కొరటాల ఇప్పటికే ప్రకటించారు.

అయితే గతంలో మన తెలుగు చిత్రాలు చాలా వరకు జపాన్‌లో కూడా విడుదలై ఘన విజయం సాధించాయి. మన టాలీవుడ్ సినిమాలకు జపాన్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. గతంలో ఆర్ఆర్ఆర్‌తో పాటు పలు చిత్రాలు సైతం జపాన్‌ భాషలో కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీని కూడా ఈ ఏడాది అక్కడ విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగానే దేవర ప్రమోషన్స్ ప్రారంభించారు యంగ్ టైగర్.

జపాన్ అభిమానులు, అక్కడి మీడియాతో వర్చువల్ ఇంటర్వ్యూలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫోటోలను దేవర టీమ్ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో షేర్ చేసింది. మూవీ ప్రమోషన్లతో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చే నెల మార్చి 22న జపాన్‌లో పర్యటించనున్నారని తెలిపింది. ఈ సినిమాను మార్చి 28న జపాన్‌లో విడుదల కానుందని మేకర్స్ వెల్లడించారు. 
 

 

 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)