Breaking News

అడివి శేష్ డకాయిట్.. ఒకే రోజు రెండు భాషల్లో రిలీజ్..!

Published on Mon, 12/15/2025 - 19:20

అడివి శేష్‌, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న ప్రేమకథా చిత్రం 'డకాయిట్‌'. ఈ మూవీకి షానీల్‌ డియో దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ  నిర్మిస్తున్నారు. అడివి శేష్ చిత్రాలైన క్షణం, గూఢచారి లాంటి సినిమాలకు కెమెరామెన్‌గా చేసిన షానీల్‌ డియో ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.  ఇద్దరు మాజీ ప్రేమికుల కథగా డకాయిట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్‌ అప్‌డేట్ ఇచ్చారు. డకాయిట్ టీజర్‌ను ఈనెల 18న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఓకేసారి రెండు భాషల్లో టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. రెండు భాషలు, రెండు నగరాలు, రెండు టీజర్స్ అంటూ ప్రత్యేక పోస్టర్స్‌ను పంచుకుంది.

ఈనెల 18న గురువారం ఉదయం 11 గంటలకు ముంబయిలో జరిగే ఈవెంట్‌లో హిందీ టీజర్‌ రిలీజ్ చేయనున్నారు. అదే రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్‌లో జరిగే ఈవెంట్‌లో టీజర్ లాంఛ్ చేయనున్నట్వు ప్రకటించారు. కాగా.. ఈ మూవీ ఉగాది కానుకగా  మార్చి 19, 2026న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా  గ్రాండ్ రిలీజ్ కానుంది. 

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)