Breaking News

ట్రేడింగ్‌ పేరుతో మోసపోయిన సినీ రచయిత.. కొంపముంచిన వీడియో

Published on Mon, 04/14/2025 - 10:07

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ ప్రసంగానికి ఆకర్షితుడై ఓ వ్యక్తి బొక్కబోర్లా పడ్డాడు. ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టడంపై ఆమె చేసిన ప్రసంగ వీడియో తిలకిస్తున్న సమయంలో స్క్రీన్‌పై వచ్చిన ఓ యాప్‌ అతడి కొంపముంచింది. పెట్టుబడి పెడితే రెండు వారాల్లోపు మంచి రాబడి వస్తుందని ఇచ్చిన హామీ మేరకు రూ.39,694లు చెల్లించి మోసపోయిన ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. 

వివరాల్లోకి వెళితే.. యూసుఫ్‌గూడ ప్రగతినగర్‌లో నివసించే జనార్దన్‌రెడ్డి(44) సినీ రచయిత. ఈ నెల 11న ఉదయం ఫేస్‌బుక్‌లో వీడియోలు తిలకిస్తున్న సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ట్రేడింగ్, పెట్టుబడి గురించి వివరించే వీడియో కనిపించింది. అది నిజమైనదిగా భావించి వీడియో ఓపెన్‌ చేశాడు. ట్రేడింగ్‌ ప్రయోజనాల కోసం రూ.21 వేలు పెట్టుబడి పెట్టడం గురించి మాట్లాడుతుండగా ఆకర్షితుడై, అక్కడ ఉన్న లింక్‌పై క్లిక్‌ చేశాడు. మరిన్ని వివరాల కోసం జీపీడీ అడిపెక్స్‌ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించడంతో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, తన పేరు, ఈమెయిల్‌ ఐడీ, ఫోన్‌ నంబర్‌ వంటి సమాచారాన్ని నమోదు చేశారు. 

పెట్టుబడి పెడితే రెండు వారాల్లో రాబడి వస్తుందని నమ్మబలికారు. దీంతో ఆయన తన క్రెడిట్‌ కార్డును ఉపయోగించి రూ.39,694లను చెల్లించాడు. ఆ వీడియోను  కుటుంబ సభ్యులకు చూపించగా అది నకిలీదిగా గుర్తించారు. వెంటనే బ్యాంక్‌కు సమాచారం ఇచ్చి ఆ మొత్తాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నించారు. అనంతరం 1930కు ఫిర్యాదు చేశారు. తనను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి