Breaking News

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో అనూహ్య మలుపు..

Published on Thu, 02/01/2024 - 16:40

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. 2018లో పలువురు తారలపై నమోదు కేసిన ఆరు కేసులను న్యాయస్థానం కొట్టిపారేసింది. సెలబ్రిటీలు డ్రగ్స్‌ తీసుకున్నట్లుగా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో ఈ కేసును కొట్టివేసినట్లు తెలిపింది. కాగా 2018 నుంచి టాలీవుడ్‌ సెలబ్రిటీలే టార్గెట్‌గా ఎక్సైజ్‌ శాఖ దూకుడు ప్రదర్శించింది. పూరీ జగన్నాథ్‌, చార్మీ, తరుణ్‌, నవదీప్‌, రవితేజ, శ్యామ్‌ కె నాయుడు, ముమైత్‌ ఖాన్‌, తనీష్‌ సహా పలువురిపై డ్రగ్స్‌ కేసు నమోదు చేసింది.

డ్రగ్స్‌ ఆనవాళ్లు లేవు!
ఈ డ్రగ్స్‌ కేసుపై దృష్టి సారించిన ప్రభుత్వం ప్రత్యేక సిట్‌ ఏర్పాటు చేసింది. డ్రగ్స్‌ కేసులో ఇరుక్కున్నవారిని నెలల తరబడి వారిని విచారించినా ఫలితం లేకపోయింది. వారి నుంచి వెంట్రుకలు, గోళ్లను శాంపిల్‌ తీసుకున్నారు. కానీ కేవలం పూరీ జగన్నాథ్‌, తరుణ్‌ శాంపిల్స్‌ మాత్రమే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. అక్కడ ఈ ఇద్దరి శరీరంలో ఎటువంటి డ్రగ్స్‌ ఆనవాళ్లు లభించలేదని తేలింది.

ఆరు కేసులు కొట్టివేత
పైగా డ్రగ్స్‌ కేసులో పాటించాల్సిన విధివిధానాలు అధికారులు సరిగా ఫాలో అవకపోవడంతో కోర్టులో ఎక్సైజ్‌ శాఖకు చుక్కెదురైంది. ఆరు కేసుల్లో ఎటువంటి సాక్ష్యాధారాలు లభించలేదని న్యాయస్థానం గుర్తించింది. పూరీ జగన్నాథ్‌, తరుణ్‌ శరీరంలో డ్రగ్స్‌ ఆనవాళ్లు లభ్యం కాలేదంటూ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ధృవీకరించిన రిపోర్టులను పరిశీలించిన అనంతరం ఎనిమిది కేసుల్లో ఆరింటిని కొట్టివేసింది.

చదవండి: 30 ఏళ్లుగా వెండితెరకు దూరం.. మర్చిపోయినా పర్లేదు, గుర్తుపెట్టుకునేలా చేస్తానంటూ..

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)