Breaking News

సమంతను ఫస్ట్ ఆడిషన్‌ చేసింది నేనే.. కానీ: టాలీవుడ్ డైరెక్టర్

Published on Tue, 04/18/2023 - 09:18

సమంత ప్రస్తుతం ఇటీవలే 'శాకుంతలం' సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో దేవ్‌ మోహన్‌ హీరోగా నటించారు. అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ కూడా ప్రత్యేకపాత్రలో నటించింది. ప్రస్తుతం ఈ సినిమాపై కొందరు అభిమానులైతే ఏకంగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు. అయితే తాజాగా సమంత కెరీర్‌పై డైరెక్టర్ శివ నాగేశ్వరరావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సమంతను టాలీవుడ్‌కు తానే పరిచయం చేయాల్సిందని అన్నారు. సమంతను ఫస్ట్ ఆడిషన్ చేసిందని తానేనని చెప్పుకొచ్చారు. 

(ఇది చదవండి: అలాంటి పాత్రలు చేయాలని ఉంది: పూజా హేగ్డే)

శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 'సమంత చెన్నైలోని సెయింట్ మేరీస్ కాలేజీలో చదువుతోంది. ఆడిషన్ కోసం హైదరాబాద్ రమ్మని పిలిచాం. ఆడిషన్ ముగిశాక సమంతను చెన్నై పంపిద్దామంటే విమాన టికెట్ ధరలు చాలా ఎక్కువ. ఆ నెక్ట్స్ డే  తక్కువగానే ఉన్నాయి. దీంతో ఒక్కరోజు హైదరాబాద్‌లో ఉండమని సమంతను అడిగాం. కానీ ఆమె అంగీకరించలేదు. చేసేదేమీ లేక టికెట్ బుక్ చేసి  అదే రోజు చెన్నై పంపించాం. హైదరాబాద్‌లో ఒక్కరోజు ఉండేందుకు కూడా ఒప్పుకోలేదు. అయితే సమంత ఆడిషన్‌ నచ్చి తీసుకుందామంటే అధిక రెమ్యూనరేషన్ డిమాండ్ చేసింది. మా వద్ద అంత బడ్జెట్ లేక వెనక్కి తగ్గాం.' అని వెల్లడించారు.

కాగా.. రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్‌గా శివ నాగేశ్వరరావు పనిచేశారు. మనీ మనీ, సిసింద్రీ, హేండ్సప్, ధనలక్ష్మి ఐ లవ్ యూ, మిస్టర్ అండ్ మిసెస్ శైలజాకృష్ణమూర్తి లాంటి సినిమాలు అందించారు. హీరోయిన్ అంజలిని ఫొటో సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయం చేశారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)