Breaking News

తొందరొద్దు తమ్ముడు.. పిల్లల్ని కనడానికి టైమ్ తీసుకోండి: టాలీవుడ్ డైరెక్టర్‌

Published on Tue, 11/11/2025 - 20:01

విక్రాంత్, చాందినీ చౌదరి హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్‌ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ సంతాన ప్రాప్తిరస్తు (Santhana Prapthirasthu). ఈ చిత్రానికి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్‌లో హిట్ సినిమాల దర్శకుడు శైలేష్ కొలను కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా దర్శకుడు శైలేష్ కొలను(Sailesh Kolanu)ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇండియాలో మాత్రమే పెళ్లవ్వగానే పిల్లలెప్పుడు అని అడుగుతారని అన్నారు. బయట ఎక్కడా కూడా ఇలా ఉండదన్నారు. ‍‍అలా అడగడంతో మనపై స్ట్రెస్‌ ఉంటుందని తెలిపారు. అయితే పెళ్లయిన పదేళ్ల గ్యాప్‌ తర్వాతే పిల్లలు ప్లాన్‌ చేసుకోవాలని డైరెక్టర్ సూచించారు.  అంతే కానీ అనవసరంగా ఒత్తిడికి గురై పిల్లల విషయంలో ఎలాంటి తొందరపాటు వద్దని యువతకు సలహా ఇచ్చారు. 

శైలేష్ కొలను మాట్లాడుతూ..' నాకు 2012లో మ్యారేజ్ అయింది. నేను, మా వైఫ్‌ పదేళ్ల తర్వాత పిల్లలు ప్లాన్ చేద్దామని డిసైడ్ అయ్యాం. డేటింగ్ టైమ్‌లో అలా ఫిక్సయ్యాం. యంగ్‌స్టర్స్‌కు నేను చెప్పేది ఒక్కటే. పెళ్లయ్యాక పిల్లల కోసం టైమ్ తీసుకోండి. పార్ట్‌నర్‌ను అర్థం చేసుకోండి. లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేయండి. నా నిజ జీవితం నుంచే ఈ విషయం నేర్చుకున్నా. యూత్‌కు నేను ఇచ్చే సలహా కూడా ఇదే' అని తన అనుభవాన్ని పంచుకున్నారు.

కాగా.. ఇప్పటికే రిలీజైన సంతాన ప్రాప్తిరస్తు ట్రైలర్‌, పాటలకు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)