పెద్దకర్రతో కొట్టబోయిన రాజమౌళి.. ఎందుకో తెలుసా?

Published on Wed, 09/11/2024 - 16:22

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌బాబుతో సినిమాను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ను విజయేంద్రప్రసాద్ అందించారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో ‍అడ్వెంచర్‌ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ వారంలో టాలీవుడ్‌ మూవీ మత్తువదలరా 2 విడుదల కానుంది. ఈ చిత్రంలో శ్రీసింహా హీరోగా నటించారు. ప్రస్తుతం చిత్రబృందం సినిమా ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు రాజమౌళిని కలిసి కాస్తా భిన్నంగా ప్రమోషన్స్ చేశారు. ఇందులో భాగంగా రాజమౌళి వద్దకు వెళ్లిన మత్తువదలరా టీమ్‌ ఎస్ఎస్ఎంబీ29 గురించి అప్‌డేట్‌ అడిగారు. దీంతో కోపానికి గురైన రాజమౌళి పెద్ద కర్ర చేతపట్టుకుని.. అప్‌డేట్ కావాలా అంటూ వారిని కొట్టేందుకు యత్నించారు. అయితే ఇదంతా కేవలం సరదాగా చేశారు. మత్తువదలరా-2 ప్రమోషన్స్‌ కోసం ఇలా వెరైటీగా ట్రై చేశారు. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరలవుతోంది. ఇది చూసిన టాలీవుడ్ ఫ్యాన్స్‌ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

(ఇది చదవండి: మత్తువదలరాని ఫ్రాంచైజీలా కొనసాగిస్తాం: శ్రీ సింహా)

కాగా.. శ్రీ సింహా, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం మత్తువదలరా 2. ఈ మూవీని రీతేష్‌ రానా దర్శకత్వంలో తెరకెక్కించారు. 2019లో వచ్చిన మత్తువదలరా-2 చిత్రానికి కొనసాగింపుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్‌ రిలీజ్ కాగా.. ప్రభాస్, రాజమౌళి చిత్రబృందాన్ని అభినందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 13న థియేటర్లలో సందడి చేయనుంది. 
 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)