Breaking News

అలా చేస్తే సక్సెస్‌ఫుల్‌గా పనికి రాకుండా పోతారు: పూరి జగన్నాధ్

Published on Fri, 11/22/2024 - 18:32

టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈ ఏడాది డబుల్ ఇస్మార్ట్‌తో ప్రేక్షకులను ‍అలరించాడు. రామ్ పోతినేని, కావ్యథాపర్ జంటగా నటించిన బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ చిత్రంలో బిగ్‌బుల్‌గా కనిపించారు.

సినిమాల విషయం పక్కనపెడితే.. దర్శకుడు పూరి మ్యూజింగ్స్ పేరుతో మోటివేషనల్ సందేశాలు ఇస్తుంటారు. జీవితంలో తను అనుభవాలతో పాటు గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని ఇలాంటి వాటిని పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆయన చేసిన మరో గొప్ప సందేశాన్ని తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకుంటారు. అదేంటో మనం కూడా వినేద్దాం.

పూరి మ్యూజింగ్‌లో మాట్లాడుతూ..' చైనాలో లావోజు అనే గ్రేట్ ఫిలాసఫర్ ఉన్నారు. ఆయన 571 బీసీలో జన్మించారు. ఆయనొక మంచి మాట చెప్పారు. నీ ఆలోచనలను గమనించు. ఎందుకంటే అవే నీ మాటలవుతాయి. నీ  మాటలే నీ యాక్షన్స్ అవుతాయి. అవే నీ అలవాట్లు.. ఆ తర్వాత అదే నీ క్యారెక్టర్ అవుతుంది. మరి మనకు థాట్స్ ఎలా వస్తాయి. మనం రోజు దేన్నైతే చూస్తామో అవే గుర్తుకొస్తాయి. చదివే పుస్తకాలు, చూసే వీడియోలు, సంభాషణలన్నీ మన ఆలోచనలు మార్చేస్తాయి. పనికిరానివన్నీ చూస్తూ టైమ్ పాస్ చేస్తే అతి తక్కువ కాలంలో మీరు కూడా సక్సెస్‌ఫుల్‌గా పనికి రాకుండా పోతారు. ' అని అన్నారు.

ఆ తర్వాత..'  మనం మొబైల్‌లో రోజు ఎన్నో చూస్తుంటాం. రోడ్డెక్కితే ఏదో ఒకటి మనం చూస్తుంటాం. వీటిలో మనం దేనికైనా ఎమోషనల్ అయితే.. అందులోనే మనం కొట్టుకుపోతాం. రోజు నాలెడ్జ్ పెంచుకోకపోయినా ఫర్వాలేదు.. నాన్ సెన్స్‌ తీసుకోకపోతే చాలు. అందుకే మంచిది, మనకు పనికొచ్చేది మాత్రమే తీసుకుంటే మంచిది. అప్పుడే మన థాట్స్ మారతాయి. మన క్యారెక్టర్‌తో పాటు రాత కూడా మారుద్ది. ' అంటూ చెప్పుకొచ్చారు. ఏదేమైనా మన పూరి జగన్నాధ్ చెప్పినవి జీవితంలో పాటిస్తే సక్సెస్‌ అవ్వాలంటే తప్పకుండా పాటించాల్సిందే.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)