Breaking News

ప్రముఖ రాజకీయ నాయకురాలితో పెళ్లి.. ప్రదీప్‌ సమాధానం ఇదే!

Published on Thu, 04/03/2025 - 14:50

బుల్లితెరపై యాంకర్‌గా క్రేజ్ దక్కించుకున్న టాలీవుడ్ నటుడు ప్రదీప్ మాచిరాజు. పలు రియాలిటీ షోలకు యాంకర్‌గా పనిచేశారు. అలా యాంకరింగ్‌తో ఫేమస్ అయిన ప్రదీప్‌ పలు సినిమాల్లోనూ ప్రత్యేక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఆయనే హీరోగా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి మూవీతో ఆడియన్స్‌ను పలకరించనున్నారు. ఈ సినిమకు నితిన్‌- భరత్‌ దర్శకత్వం వహించారు.

ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు ప్రదీప్‌. ఇటీవలే ట్రైలర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. తన మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ప్రదీప్‌ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. త్వరలోనే ఓ రాజకీయ నాయకురాలితో మీ పెళ్లి జరగనుందని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. సమయం వచ్చినప్పుడు తప్పుకుండా పెళ్లి అయితే చేసుకుంటానని అన్నారు.

తన పెళ్లి గురించి ప్రదీప్ మాట్లాడుతూ.. 'నా పెళ్లికి సంబంధించి ఎలాంటి ప్లాన్ లేదు. ముందు జీవితంలో సెటిల్‌ కావాలనుకున్నా. నాకు సొంతంగా కొన్ని డ్రీమ్స్‌ ఉన్నాయి. ముందు వాటిని సాధించడమే నా లక్ష్యం. అవీ ఆలస్యం కావడంతోనే  మిగిలిన పనులు కూడా వాయిదా పడుతున్నాయి. అన్నీ కూడా సరైన టైమ్‌కే పూర్తి అవుతాయని నమ్ముతున్నా.  రాజకీయ నాయకురాలితో తన పెళ్లి  అని వస్తున్న వార్తలు నేనూ విన్నా.. అంతకుముందే రియల్‌ ఎస్టేట్‌ కుటుంబానికి చెందిన అమ్మాయితో పెళ్లి అన్నారు.. త్వరలో క్రికెటర్‌తో పెళ్లి అంటారేమో. అన్నీ సరదా కోసమే చేస్తున్న ప్రచారం' అంటూ నవ్వుతూ మాట్లాడారు. కాగా.. ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన చిత్రం అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి ఏప్రిల్‌ 11న విడుదల కానుంది.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి