Breaking News

నేను చాలా సేఫ్‌గా ఉన్నా.. దయచేసి అవన్నీ నమ్మొద్దు: సుప్రీత విజ్ఞప్తి

Published on Tue, 03/18/2025 - 15:09

త్వరలోనే టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న సుప్రీత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. బిగ్‌బాస్‌ -7 రన్నరప్‌ అమర్‌దీప్‌ చౌదరితో కలిసి ప్రస్తుతం ఓ సినిమా చేస్తోంది.  సుప్రీత హోలీ పండుగ రోజును అభిమానులను ఉద్దేశించి ఓ వీడియోను రిలీజ్ చేసింది. తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్‌ను తాను కూడా ప్రమోట్ చేశానని వెల్లడించింది. దయచేసి ఎవరూ కూడా ఇలాంటి పనులు చేయవద్దని విజ్ఞప్తి చేసింది.  మీరు కూడా అందరూ ఇలాంటి వారికి దూరంగా ఉండాలని ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసింది.

అయితే గత కొద్ది రోజులుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్‌, యూట్యూబర్లపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పలువురు సినీ తారలపై కేసు కూడా నమోదు చేశారు. వీరిలో సుప్రీత, టేస్టీ తేజ,  విష్ణుప్రియ, రీతూచౌదరి లాంటి వారి పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

(ఇది చదవండి: క్షమాపణలు చెప్పిన సురేఖవాణి కూతురు సుప్రీత.. ఎందుకంటే?)

అయితే తాజాగా తనపై వస్తున్న వార్తలపై సురేఖ వాణి కూతురు సుప్రీత స్పందించింది. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీస్‌ వేదికగా మరో వీడియోను విడుదల చేసింది. దయచేసి సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలను ఎవరూ నమ్మొద్దు.. అవన్నీ ఫేక్ స్పష్టం చేసింది. ప్రస్తుతం నేను మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నానని సుప్రీత వెల్లడించింది.

సుప్రీత మాట్లాడుతూ..'హాయ్.. అందరికీ నమస్కారం.. నేను మీ సుప్రీత. సోషల్ మీడియాతో పాటు టీవీ ఛానెల్స్‌లో నాపై వస్తున్న ప్రచారాలన్నీ అబద్ధాలు. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. నేను ఇప్పుడు షూటింగ్‌లో ఉ‍న్నాను. మీరు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దు. థ్యాంక్‌ యూ సో మచ్‌ ఆల్.' అంటూ వీడియోను రిలీజ్ చేసింది. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)