Breaking News

మనుషులనే వదలరు.. కుక్కలను వదిలేస్తారా?.. రేణు దేశాయ్

Published on Fri, 05/01/2026 - 18:41

టాలీవుడ్ నటి రేణు దేశాయ్ మూగ జీవాలకు ఏ కష్టమొచ్చినా తట్టుకోలేదు. ముఖ్యంగా వీధి కుక్కల రక్షణ కోసం ఆమె పోరాటం చేస్తూనే ఉంది. ఎక్కడైనా వాటిని హింసించినా.. హానీ తలపెట్టినా తన దృష్టికి వస్తే రియాక్ట్ అవుతూ ఉంటోంది. తాజాగా కొద్ది రోజులుగా కుక్కల రక్తం తీసి అమ్ముకుంటున్నారని ఓ వార్త తెగ వైరలవుతోంది. హైదరాబాద్‌లోనే ఈ దందా నడుస్తోందని సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కుక్క రక్తం అమ్మకాలపై రేణు దేశాయ్ రియాక్ట్ ‍అయింది.

రేణు దేశాయ్ మాట్లాడుతూ..'గత ‍మూడు రోజులుగా మనం వింటున్నాం. అసలు ఈ రక్తం ఎవరు అమ్ముతున్నారు? ఎవరు కొంటున్నారు? ఇద్దరిదీ తప్పే. మనం ఇప్పుడు కలియుగంలో ఉ‍న్నాం.  మనుషులనే కిడ్నాప్ చేసి కిడ్నీలు అమ్మేవారు కుక్కలను వదిలేస్తారా? కానీ కొంచమైనా భయం, భక్తితో ఉండండి. మనం ఏదైనా తప్పు చేస్తే ఆ కర్మ మన పిల్లకు తగులుతుందని మైండ్‌లో పెట్టుకోండి. కుక్కల రక్తంతో డబ్బులు సంపాదించడం కరెక్ట్ కాదు. వీధి కుక్కలతో ఇలాంటి పనులు చేయడం దారుణం. డబ్బు సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ కుక్కలు, పిల్లులతో ఇలా చేస్తే అది పెద్ద కర్మ. అందరికీ డబ్బు కావాలి. కానీ ఇలా సంపాదించడమనేది ఎంతవరకు సమంజసం' అంటూ మాట్లాడింది.

నిన్న కూడా ఫస్ట్‌ టైమ్ నన్ను మోసం చేశారని రేణు తెలిపింది. మెడిసిన్ బాటిల్స్ ఆర్డర్ చేస్తే పగిలిన పోయినవి వచ్చాయని వెల్లడించింది. ముసలి వాళ్లను టార్గెట్ చేసి.. ఓటీపీలు తీసుకుని మోసాలు చేస్తున్నారు. రాక్షసులైతేనే ఇలాంటి పనులు చేస్తారని.. మనుషులైతే ఇలా చేయరని రేణు మండిపడింది. చెడు మార్గాలు, మోసాలు, గ్యాంబ్లింగ్‌ ద్వారా డబ్బు సంపాదించే ప్రయత్నాలను ఆపాలని రేణు దేశాయ్ కోరింది. నిజాయితీగా, కష్టపడి పనిచేయడానికి ప్రయత్నించడని హితవు పలికింది. ఎందుకంటే కర్మ అనేది నిజం.. అది ఎవరినీ వదిలిపెట్టదని తెలిపింది. ఆ దేవుడు అంతా గమనిస్తూ ఉంటారని పేర్కొంది. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నాయని.. అందరు సురక్షితంగా ఉండాలని రేణు దేశాయ్ కోరింది.

 

 

 

Videos

ట్రంప్ పై దాడి Live వీడియో.. ఇలా వచ్చాడు.. అలా కాల్చాడు

వివాదంలో పంజాబ్ సీఎం.. మద్యం సేవించి అసెంబ్లీకి..?

పాలకొల్లులో అరుదైన ఘటన.. పది ఫలితాల్లో తల్లీకొడుకులు ఒకే సారి పాస్

ఆరుగురితో కాదు 36 మందితో చాటింగ్.. సీతారాం పెన్ డ్రైవ్ లో సంచలనాలు..

భార్య పాపులారిటీ తట్టుకోలేక నరికి చంపిన భర్త

బాలీవుడ్ హీరోతో పూజా హెగ్డే ప్రేమ..?

ఖమ్మం రాము మర్డర్ కేసులో వీడని మిస్టరీ

వేధింపుల్లో బాబు కొత్త ట్రెండ్

మన్యం జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

EVMల టాంపరింగ్.. బెంగాల్లో షాకింగ్ వీడియో

Photos

+5

బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రిసెప్షన్‌: ప్రముఖుల సందడి (ఫోటోలు)

+5

ప్రెగ్నెన్సీతో మ్యాడ్ స్క్వేర్‌ బ్యూటీ రెబా మోనికా జాన్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటి మీనా వాసు మ్యారేజ్ డే.. భర్తకు స్పెషల్ విషెస్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో వరలక్ష‍్మి శరత్‌కుమార్‌ (ఫొటోలు)

+5

గ్లామర్ ఓవర్‌లోడెడ్.. మెరిసిపోతున్న కియారా (ఫొటోలు)

+5

సెలబ్రేషన్స్, డివోషనల్ ట్రిప్స్.. అల్లు స్నేహ ఏప్రిల్ గడిచిందిలా (ఫొటోలు)

+5

కూవాగంలో హిజ్రాల పెళ్లి సందడి..ఎందుకో తెలుసా? (ఫొటోలు)

+5

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి HD ఫొటోలు

+5

భారీ వర్షం : బెంగళూరు అతలాకుతలం (ఫొటోలు)

+5

తిరుచానూరు : వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు (ఫోటోలు)