Breaking News

'నేనేం పాపం చేశా.. ఇలా తిట్టడం మంచిది కాదు..'రేణు దేశాయ్

Published on Mon, 04/06/2026 - 21:38

సినీ నటి రేణు దేశాయ్‌ మరో వీడియో రిలీజ్ చేసింది. తమపై ‍అసభ్యంగా కామెంట్స్ ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించింది. మేము ఆర్టిస్టులమని..మా మనసు చాలా సున్నితంగా ఉంటుందని రేణు దేశాయ్ తెలిపింది. మేము టెర్రరిస్టులం కాదు కదా అని ప్రశ్నించింది. ఎవరైనా క్రైమ్ చేస్తుంటే వాళ్లను తిట్టండి.. కానీ మాలాంటి ఆర్టిస్టులను తిట్టొద్దండి.. ప్లీజ్ అని వేడుకుంది. మేమేమీ నేరాలు చేయట్లేదు కదా అని రేణు దేశాయ్ వెల్లడించింది. మీకు నా పని నచ్చకపోతే.. నన్ను ఫాలో చేయడం ఆపేయండి అని సూచించింది. నేనేం పాపం చేశా.. ఇంత అసభ్యంగా తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా.. రేణు దేశాయ్‌ను అసభ్యకర పదజాలంతో దూషించిన ఆరుగురిని హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆమె ఒక వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. కొద్దిరోజుల క్రితం ఒక మీడియా సమావేశంలో వీధి శునకాల రక్షణ గురించి ఆమె మాట్లాడిన విషయం తెలిసిందే.  వంద కుక్కల్లో 10 పిచ్చివి ఉంటాయని, వాటితో జాగ్రత్తగా ఉండాలని ఆమె చెప్పారు. ఆ పదింటి కోసం మిగిలిన 90 కుక్కల్ని చంపకూడదని ఆమె అన్నారు. ఆ తర్వాత ఆమెపై కొందరు నెటిజన్లు బూతులతో రెచ్చిపోయారు.

సోషల్‌మీడియా వేదికగా ఫేక్‌ అకౌంట్‌లు క్రియేట్‌ చేసుకుని నిత్యం అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని రేణూ దేశాయ్‌(Renu Desai) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెడు కామెంట్లు చేసే వారిని వాళ్ల  అమ్మానాన్నల ముందు నిలబెడతానని హెచ్చరించారు. ఆమె చెప్పినట్లుగానే ఫిర్యాదు చేయడంతో తాజాగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆరుగురిని అరెస్ట్‌ చేశారు.
 

 

Videos

శభాష్ జగన్ అంటున్న కూటమి నేతలు..

మావిగన్ పేరెత్తగానే ఎందుకు అంత భయపడుతున్నారు?

RK అక్షర వ్యభిచారం..! శవాలపై చిల్లర ఏరుకోడానికి కూడా సిద్ధం

చంద్రబాబు నోటికి ప్లాస్టర్ రెచ్చిపోతున్న దగ్గుబాటి ప్రసాద్..

పచ్చ నేతల రౌడీయిజం 3 కోట్ల NRI భూమి కబ్జా

ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకున్నాడు చంపేశాడు

తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం

శత్రుదేశంలో ఉన్న పైలట్ ను ఎలా కాపాడారు.. ఎన్ని ఆయుధాలు వాడారంటే

RBI బంపర్ ఆఫర్.. బ్యాంక్ ఎఫ్ డీలకు మించి వడ్డీ..!

జీతంలో కోత పంచాయతీ కార్యదర్శులకు బిగ్ షాక్

Photos

+5

శోభితలో ఈ టాలెంట్‌ కూడా ఉందా! (ఫోటోలు)

+5

అప్పుడే ఏడేళ్లు.. ఎంత త్వరగా ఎదుగుతున్నావో!: లాస్య మంజునాథ్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా 'లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో సెలెబ్రిటీల సందడి (ఫోటోలు)

+5

శేష్‌-మృణాల్‌ ‘డెకాయిట్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. రష్మిక చిన్నప్పటి క్యూట్‌ ఫోటోలు

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 05-12)

+5

ఉప్పల్‌లో క్రికెట్‌ ఉత్సాహం (ఫొటోలు)

+5

చిరు, దిల్‌రాజు భార్యలు అతిథులుగా కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)