'నా తరఫున ఎవరూ నిలబడరని తెలుసు'.. మంచు లక్ష్మీ పోస్ట్ వైరల్!

Published on Fri, 10/10/2025 - 22:37

ఓ వ్యక్తి తనకు సారీ చెప్పేందుకు మూడు వారాల సమయం పట్టిందని టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ  తెలిపింది. నేను ఈ సారి మౌనంగా ఉండాలని అనుకోలేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నా తరఫున ఎవరూ నిలబడరని నాకు తెలుసు.. ఈ అనుభవం నన్ను లోతుగా గాయపరిచిందని తెలిపింది. నాకు కావల్సింది కేవలం ఒక నిజమైన క్షమాపణ.. బాధ్యతను స్వీకరించడం మాత్రమేనని మంచు లక్ష్మీ పోస్ట్ చేసింది.

ఇలాంటి చిన్న చిన్న ప్రతిఘటనలే ఆడవాళ్ల గొంతుని మూగబోకుండా కాపాడతాయని మంచు లక్ష్మీ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. నాకంటే ముందు ధైర్యంగా మాట్లాడిన ఆడవాళ్ల వరుసలోనే నేనూ నిలబడి ఉన్నా… వారి ధైర్యమే నాకు రోజు బలాన్నిస్తుందని తెలిపింది. పత్రికా రంగం వృత్తిపై నాకు చాలా గౌరవం ఉందని.. ప్రజలకు నిజం తెలియజేయడంలో ప్రాణం పెట్టే జర్నలిస్టులు ఈ సమాజానికి వెలుగు చూపే దీపాల్లాంటి వారని కొనియాడింది. కానీ ఆ శక్తిని సార్థకమైన సంభాషణల కంటే వ్యక్తిగత దాడుల కోసం వాడినప్పుడే అది ఎంతో బాధని కలిగిస్తుందని రాసుకొచ్చింది.  నేను  ఇంతటితో ఈ విషయాన్ని ప్రశాంతంగా ముగిస్తున్నాను.. ఇకపైన కూడా ఆత్మగౌరవంతో నడవబోతున్నాను.. నిజాయితీతో తన కథని వినిపించే ప్రతి మహిళకు గౌరవం తెలియజేస్తున్న మంచు ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

m

కాగా.. ఇటీవల మంచు లక్ష్మీ ఓ ఇంటర్వ్యూకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెను వయస్సు గురించి ప్రశ్నించారు. ఇది కాస్తా పెద్దఎత్తున వివాదానికి దారితీసింది. తాజాగా ఆ వ్యక్తి క్షమాపణలు కోరడంతో మంచు లక్ష్మీ వివరణ ఇచ్చింది. ఇక ఇలాంటివీ రిపీట్‌ కాకుండా చూసుకుంటానంటూ అతను మంచు లక్ష్మీని క్షమాపణలు కోరాడు. 
 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)