Breaking News

నా రియల్ లైఫ్‌లో వాళ్లు లేరు.. అయినా ఫీల్ కాలేదు: లయ

Published on Tue, 07/01/2025 - 16:07

తెలుగులో చాలా సినిమాల్లో హీరోయిన్‌గా మెప్పించిన బ్యూటీ లయ. భద్రం కొడుకో మూవీలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా అడుగుపెట్టిన లయ.. ఆ తర్వాత స్వయంవరం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో  హీరోయిన్‌గా మెప్పించింది. అయితే పెళ్లి తర్వాత యూఎస్ వెళ్లిపోయిన లయ.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా జాబ్‌ కూడా చేసింది. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తోంది.

నితిన్‌ హీరోగా వస్తోన్న తమ్ముడు చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూలై 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో రిలీజ్‌ ట్రైలర్ లాంఛ్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ ఈవెంట్‌కు హాజరైన లయ.. తమ్ముడు సినిమా గురించి తన అనుభవాలు పంచుకుంది. నా రియల్ లైఫ్‌లో అక్కా, తమ్ముడు అంటూ తనకెవ్వరు లేరని తెలిపింది. అందుకే ఈ చిత్రం తన కెరీర్‌లో చాలా స్పెషల్‌ ‍అని ఆనందం వ్యక్తం చేసింది. ఈ మూవీ కోసం దాదాపు 90 రోజుల పాటు చెప్పుల్లేకుండానే పని చేశానని లయ వెల్లడించింది.

లయ మాట్లాడుతూ..' ఈ సినిమాలో ఉన్న ఎమోషన్స్‌కు నేను ఎప్పుడు ఫీలవ్వలేదు. ఎందుకంటే నాకు అక్కా, తమ్ముడు, చెల్లి లాంటి వాళ్లు ఎవరూ లేరు. నా సినిమా జర్నీలో ఇది ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్. సినిమా మొత్తం చెప్పుల్లేకుండా పరిగెత్తడం చాలా ఈజీ అనుకున్నా. కానీ తర్వాత రోజు అలానే చేస్తుంటే ఆ నొప్పి అప్పుడు అర్థమైంది. దెబ్బ మీద దెబ్బ తగిలి అలానే అలవాటు చేసుకున్నా. ఇన్నాళ్లు నా పాత సినిమాలు చూసి ఎలా అభిమానించారో.. నా తమ్ముడు సినిమాకు కూడా అలాగే మద్దతిస్తారని ఆశిస్తున్నా' అని తన అనుభవాన్ని పంచుకుంది.

కాగా.. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, సప్తమీ గౌడ కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్‌ కానుంది. ఈ సినిమాలో నితిన్‌ అక్కగా ఝాన్సీ కిరణ్మయి పాత్రలో నటించింది.
 

Videos

పిఠాపురంలో జనసేన ఆఫీసును ముట్టడించిన మత్స్యకారులు

వైఎస్సార్ జిల్లా అనిమెలలో బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ కార్యక్రమం

సిట్ ఎంక్వైరీ అధికారులు చేస్తున్నారా..? ఎల్లో మీడియా చేస్తుందా..?: అమర్నాథ్

నటులు రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మీకి ఈడీ నోటీసులు

Suryapet: జ్యువెలరీ షాపు దొంగతనం కేసులో వెలుగులోకి మరికొన్ని విషయాలు

మీ తప్పులు ప్రశ్నిస్తే... ఏకిపారేసిన రోజా

హైదరాబాద్ లో బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని అక్రమ అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు

కేరళ మాజీ సీఎం కన్నుమూత

రమేష్‌రెడ్డిని ఫోన్‌లో పరామర్శించిన వైఎస్‌ జగన్‌

పంచాయతీలను నాశనం చేశారు పవన్ కళ్యాణపై సర్పంచులు ఫైర్

Photos

+5

కేరళ వెకేషన్‌ ఎంజాయ్ చేస్తోన్న టాలీవుడ్‌ నటి అభినయ (ఫొటోలు)

+5

కూతురితో కలిసి బెంగళూరు విమానాశ్రయంలో హీరోయిన్ ప్రణీత చిల్ (ఫొటోలు)

+5

విజయవాడలో అర్ధరాత్రి దంచికొట్టిన భారీ వర్షం (ఫొటోలు)

+5

ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు రికార్డు స్థాయిలో భక్తుల సారె.. (ఫొటోలు)

+5

భాగ్యనగరంలో వైభవంగా బోనాల ఉత్సవాలు (ఫొటోలు)

+5

విజయనగరం: శ్రీ విజయ సాగర దుర్గా మల్లేశ్వర అమ్మవారి ఆషాడం సారే (ఫొటోలు)

+5

ట్రెండీ వేర్ కాదు.. చీరలో ఒకప్పటి హీరోయిన్ మీనా (ఫొటోలు)

+5

మెగా కోడలు ఉపాసన బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జులై 20-27)

+5

హైదరాబాద్ లో ఘనంగా బోనాలు (ఫొటోలు)