మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!
Breaking News
అప్పట్లో దేవుళ్లు.. ఇప్పుడు స్మగ్లర్లు, క్రిమినల్స్: నటి షాకింగ్ కామెంట్స్
Published on Fri, 09/04/2026 - 17:17
టాలీవుడ్ నటి కస్తూరి శంకర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో వస్తోన్న మూవీస్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. మన తెలుగులో మొదట్లో హీరోలు దేవుడి పాత్రల్లో నటించేవారని తెలిపింది. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో హీరోలు పోలీస్, లాయర్, విప్లవాత్మకమైన పాత్రలు ఎక్కువగా కనిపించాయని పేర్కొంది. అయితే ఈ నాటి చిత్రాల్లో మాత్రం స్మగ్లర్, క్రిమినల్ లాంటి పాత్రల్లో మాత్రమే హీరోలు కనిపిస్తున్నారని విమర్శించింది. సోషల్ మేసేజ్‌తో వచ్చే చిత్రాలు చాలా తగ్గాయని ఆవేదన వ్యక్తం చేసింది.
కస్తూరి శంకర్ మాట్లాడుతూ.." చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సినిమాను సినిమాగానే చూడాలి. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే మాయాబజారు, కృష్ణార్జున యుద్ధం, ప్రేమాభిషేకం లాంటి చిత్రాలు చూసేదాన్ని. అప్పట్లో దేవుడి పాత్రల్లో ఎక్కువ కనిపించేవారు. కానీ ఇప్పుడు సినిమాల్లో మాత్రం స్మగ్లర్, క్రిమినల్ పాత్రలు చేసే సినిమాలు వస్తున్నాయి. ఆనాడు ఒక సామాజిక బాధ్యతతో సినిమాలు చేసేవారు. అలాంటి సోషల్ మేసేజ్ ఇచ్చే మూవీనే మా ధర్మస్థల నియోజకవర్గం" అని తెలిపింది. ఆమె కీలక పాత్రలో నటించిన ధర్మస్థల నియోజకవర్గం ఇవాళే థియేటర్లలో రిలీజైంది. ఈ సందర్భంగా కస్తూరి శంకర్ తెలుగు సినిమాలను ఉద్దేశించి కామెంట్స్ చేసింది.
మొదట్లో తెలుగు సినిమాల్లో హీరోలు దేవుడి పాత్రల్లో నటించేవారు.
ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో హీరోలు పోలీస్, లాయర్, విప్లవాత్మకమైన పాత్రల్లో నటించేవారు.
ఇప్పుడు వస్తున్న సినిమాల్లో హీరోలు స్మగ్లర్, క్రిమినల్ లాంటి పాత్రల్లో నటిస్తున్నారు.
- Kasthuri Shankar… pic.twitter.com/s1FglISJx7— Tupaki (@tupaki_official) September 3, 2026
Tags : 1