Breaking News

రెండో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ఇలియానా

Published on Tue, 06/17/2025 - 16:43

తెలుగులో 'పోకిరి' లాంటి హిట్ సినిమాతో ఫేమ్ సంపాదించిన ఇలియానా.. తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. కానీ ఫ్లాప్స్ పడటంతో ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. నటనని పూర్తిగా పక్కనబెట్టేసిన ఈమె..ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. అలాంటిది ఇప్పుడు ఈమె నుంచి గుడ్ న్యూస్ వచ్చేసింది. రెండోసారి బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది.

ముంబైకి చెందిన ఇలియానా.. 'దేవదాసు' మూవీతో హీరోయిన్‌గా మారింది. అలా తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడలో పలు మూవీస్ చేసింది. టాలీవుడ్‌లో ఈమెకు అప్పట్లో జీరో సైజ్ బ్యూటీ అనే క్రేజ్ ఉండేది. అలా పోకిరి, శక్తి, మున్నా, జల్సా, జులాయి తదితర సినిమాలతో సక్సెస్ అందుకుంది. కానీ హిట్స్ కంటే ఈమెని ఫ్లాప్స్ ఎక్కువ వరించాయి. దానికి తోడు చాలా గ్యాప్ తర్వాత తెలుగులో చేసిన 'అమర్ అక్బర్ ఆంటోని' ఘోరంగా ఫెయిల్ అవడంతో పూర్తిగా టాలీవుడ్‌కి దూరమైంది.

(ఇదీ చదవండి: 'రాజాసాబ్' మారుతి.. ఏకంగా ఆరు కథలు!)

చివరగా గతేడాది 'దో ఔర్ దో ప్యార్' అనే హిందీ సినిమాలో కనిపించింది. అంతకు ముందే అంటే 2023లోనే మైఖేల్ డోలన్ అనే విదేశీయుడితో ఓ కొడుక్కి జన్మనిచ్చింది. గతేడాది అక్టోబరులో తాను రెండోసారి ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని బయటపెట్టిన ఇలియానా.. తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా భర్త డోలన్‌, రోజుల బిడ్డతో ఉన్న ఫొటోని పోస్ట్ చేసింది. బెస్ట్ డాడీ అని చెప్పుకొచ్చింది.

ఈ క్రమంలోనే ఇలియానా మరో బిడ్డకు జన్మనిచ్చిందని అంటున్నారు. అయితే ఆమె వైపు నుంచి మాత్రం ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. గత కొన్నేళ్ల నుంచి మాత్రం సోషల్ మీడియాకు ఇలియానా దురంగా ఉంటూనే వస్తోంది. ఇప్పుడు కూడా రెండో బిడ్డ పుట్టిన విషయాన్ని రివీల్ చేయట్లేదు. త్వరలో మంచి రోజు చూసి చెబుతుందేమో?

(ఇదీ చదవండి: సమంత.. ఆ జ్ఞాపకం ఇంకా అలానే)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)