Breaking News

బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్

Published on Fri, 10/04/2024 - 13:35

తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన చిత్రా శుక్లా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. నాలుగు రోజుల క్రితం అంటే సెప్టెంబరు 30న రాత్రి 9:31 నిమిషాలకు బిడ్డ పుట్టాడని చెప్పారు. ఇదే ముహూర్తానికి తమకు పెళ్లి జరిగిందని, ఇప్పుడు బాబు పుట్టడం మరింత స్పెషల్ అని తన సంతోషాన్ని వ్యక్తపరిచింది.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు)

ఇండోర్‌కి చెందిన చిత్రా శుక్లా.. 2014 నుంచి సినిమాలు చేస్తోంది. బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్‌గా ఈమె కెరీర్ మొదలైంది. 2017లో 'మా అబ్బాయి' అనే తెలుగు సినిమాతో హీరోయిన్ అయింది. అలా రంగుల రాట్నం, సిల్లీ ఫెలోస్, తెల్లవారితే గురువారం, పక్కా కమర్షియల్, ఉనికి, హంట్, మస్తే షేడ్స్ ఉన్నాయిరా, కలియుగ పట్టణంలో అనే చిత్రాల్లో యాక్ట్ చేసింది.

వ్యక్తిగత విషయానికొస్తే గతేడాది డిసెంబరులో వైభవ్ ఉపాధ్యాయ అనే పోలీస్ అధికారిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మగబిడ్డని ప్రసవించింది. తన ఆనందాన్ని తెలియజేస్తూ కొడుకు ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మీరు కూడా వాటిని చూసేయండి.

(ఇదీ చదవండి: Kali 2024 Movie Review: 'కలి' సినిమా రివ్యూ)

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు