Breaking News

'అందరికీ ఇదే నా విజ్ఞప్తి'.. అనసూయ ఆసక్తికర ట్వీట్

Published on Thu, 12/25/2025 - 12:20

టాలీవుడ్ నటి అనసూయ మరో పోస్ట్ చేసింది. ఇప్పటికే శివాజీ కామెంట్స్‌కు కౌంటరిచ్చిన అనసూయ తాజాగా ట్వీట్ చేసింది. ఇది కేవలం మహిళల గురించి మాత్రమే కాదని తెలిపింది. పాత తరాలు నేర్చుకున్నవి, అలవాటుపడ్డ ఆలోచనలు మనం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొంది. కొంతమంది పురుషులు, మహిళలు కూడా నా వయసును ఉపయోగించి నన్ను తక్కువగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది.

అనసూయ తన ట్వీట్‌లో రాస్తూ..' కొంతమంది పురుషులు, మహిళలు కూడా.. నా వయసును ఉపయోగించి నన్ను తక్కువగా చూపించడానికి.. నన్ను చిన్నగా భావింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు.. ఈ విధమైన ఆలోచన కలిగిన వారు ఎక్కువగా ప్రగతిశీల మహిళలను లక్ష్యంగా చేసుకుంటారు.. ఇది మహిళలపై నియంత్రణ కోల్పోతామన్న భయం వల్ల.. అలాగే బలహీనమైన పితృస్వామ్య అహంకారాన్ని పోషించుకోవాలనే ఉద్దేశంతో జరుగుతుంది. ఇది అందరి పురుషుల గురించీ లేదా అందరి మహిళల గురించీ కాదు.. కానీ నేను పురుషులు.. మహిళలు.. అందరికీ విన్నపం చేస్తున్నాను.. దయచేసి విస్తృతంగా ఆలోచించండి.. పాత తరాలు నేర్చుకున్నవి లేదా అలవాటుపడ్డ ఆలోచనలు మనం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని' తెలిపింది.

ఇప్పుడున్న సమాజంలో మనం మార్పును ఎంచుకోవచ్చు.. మన గౌరవాన్ని.. మన స్వేచ్ఛను కాపాడుకోవచ్చని తెలిపింది. ఒకరికొకరం శక్తినివ్వాలి.. మద్దతుగా నిలవాలి.. మన విలువ మన ఎంపికల నుంచే వస్తుంది.. మరే దానితో కాదని హితవు పలికింది. అంతేకాకుండా కొంతమంది మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.. మీ పని బాధ్యతతో చేయాలి.. ఈ విధమైన మహిమాపరచడం (గ్లోరిఫికేషన్) సమంజసం కాదని ట్వీట్‌లో రాసుకొచ్చింది.

 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)