Breaking News

భార్యకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన రాకింగ్ రాకేశ్.. పోస్ట్ వైరల్

Published on Tue, 02/25/2025 - 08:04

గతేడాది కేశవ చంద్రా రమావత్ (కేసీఆర్) మూవీతో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ కమెడియన్ రాకింగ్ రాకేశ్. ఈ సినిమాకు గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, కొత్తగా ఏర్పడిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికైన పరిణామాలకు ఓ లంబాడీ యువకుడి జీవితం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. అయితే జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫేమ్ తెచ్చుకున్నాడు రాకింగ్ రాకేశ్. ఆ తర్వాత తెలుగు బుల్లితెరపై నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

సుజాతను పెళ్లాడిన రాకేశ్..

అచ్చ తెలంగాణ యాసలో గలగలా మాట్లాడే యాంకర్ జోర్దార్‌ సుజాతను ఆయన పెళ్లాడారు. 2023 ఫిబ్ర‌వ‌రి 24న తిరుమ‌ల‌లో వారి పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది. జోర్దార్‌ సుజాత టాలీవుడ్ రియాలిటీ షో బిగ్‌బాస్‌ ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకుంది. బిగ్‌బాస్‌తో గుర్తింపు వచ్చిన తర్వాత జోర్దార్ సుజాత ఒక కామెడీ షోలో నటించింది. ఈ క్రమంలో  రాకింగ్ రాకేష్‌తో జంటగా ఆమె కొన్ని ప్రొగ్రామ్స్‌ చేసింది. అలా వారి ప్రేమకు తొలి అడుగులు పడ్డాయి.

పెళ్లి రోజు శుభాకాంక్షలు..

అయితే తాజాగా ఈ టాలీవుడ్ బుల్లితెర జంట తమ రెండో వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తన భార్యకు ప్రత్యేకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు రాకింగ్ రాకేశ్. ఈ మేరకు తన ట్విటర్ ‍ద్వారా వారి పెళ్లి ఫోటోను పంచుకున్నారు.

ట్విటర్‌లో రాకింగ్‌ రాకేశ్ రాస్తూ..'పెళ్లిరోజు ఓ మధుర జ్ఞాపకం.. ప్రేమగా మొదలై.. బంధంగా ముడిపడి..  బాధ్యతగా జీవితంలో సగభాగంగా అన్ని తనై నడిపిస్తూ మా ఇంటి మహాలక్ష్మికి  పెళ్లి రోజు శుభాకాంక్షలు.. మీ అందరి ఆశీస్సులతో మా పెళ్లి బంధానికి రెండు సంవత్సరాలు' అంటూ పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు రాకింగ్ రాకేశ్, జోర్దార్ సుజాతకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా.. గతేడాది అక్టోబర్‌లో ఈ జంటకు కుమర్తె జన్మించిన సంగతి తెలిసిందే. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)