Breaking News

'ఇది ఒక సవాలు మాత్రమే కాదు'.. మోహన్‌బాబు ఎమోషనల్‌ పోస్ట్‌

Published on Sun, 12/08/2024 - 16:30

వెండితెరపై విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్‌ దిగ్గజం మోహన్ బాబు. 1970లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. దాసరి నారాయణరావు తెరకెక్కించిన ‘స్వర్గం నరకం’ సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. తన నటనతో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్ గా, నిర్మాతగా, విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా మెప్పించిన ఏకైక నటుడు ఆయనే. తన దశాబ్దాల సినీ ప్రస్థానంలో మోహన్ బాబు స్వయంకృషితోనే ఎదిగారు. పెదరాయుడు, శ్రీరాములయ్య, అడవిలో అన్న లాంటి సినిమాలు మోహన్ బాబు స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఎక్కడో రాయలసీమలోని ఒక మారుమూల గ్రామం నుంచి ఇండస్ట్రీకి వచ్చిన తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే తాజాగా తాను నటించిన కోరికలే గుర్రాలైతే(1979) చిత్రాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రంలో యమధర్మరాజు పాత్రలో ఆయన కనిపించారు. ఈ సినిమాలో సీన్స్ నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులోని ఈ సన్నివేశం నా కెరీర్‌లో ఓ ప్రత్యేక మైలురాయిగా మిగిలిపోతుందని ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు.

మోహన్ బాబు తన ట్వీట్‌లో రాస్తూ..'నా గురువు, లెజెండరీ శ్రీ దాసరి నారాయణరావు గారు, నిర్మాత శ్రీ జి జగదీష్ చంద్ర ప్రసాద్ ఆధ్వర్వంలో వచ్చిన ఈ సన్నివేశం నా కెరీర్‌లో ఓ ప్రత్యేక మైలురాయిగా నిలిచిపోతుంది. చంద్రమోహన్, మురళీ మోహన్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం. ఇది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తొలిసారిగా యమ ధర్మరాజు పాత్ర చేయడం మరచిపోలేని అనుభూతి. ఈ సన్నివేశం ఒక సవాలు మాత్రమే కాదు.. ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ చిత్రం నా సినీ ప్రయాణంలో ఒక ప్రత్యేకతగా నిలిచింది.'  అంటూ పోస్ట్ చేశారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)