Breaking News

లైలా ఈవెంట్‌లో పృథ్వీదే వందశాతం తప్పు: బ్రహ్మజీ

Published on Fri, 02/14/2025 - 13:03

టాలీవుడ్ నటుడు బ్రహ్మజీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన లైలా మూవీ ఈవెంట్‌ వివాదంపై స్పందించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పృథ్వీ మాట్లాడిన మాటలు వందశాతం తప్పని బ్రహ్మజీ అన్నారు. ఈ విషయంలో పృథ్వీని టార్గెట్‌ చేయడం సరైందే అని తన అభిప్రాయం వెల్లడించారు. సినిమా ఈవెంట్‌కు వచ్చి అలా మాట్లాడటం కరెక్ట్ కాదని హితవు పలికారు. 

బ్రహ్మజీ మాట్లాడుతూ..' లైలా ఈవెంట్‌లో పృథ్వీది తప్పు. సినిమా ఈవెంట్‌కు వచ్చి అలా మాట్లాడకూడదు. పృథ్వీ మీద రియాక్ట్ అయిన వాళ్లందరూ కరెక్టే. ఎలక్షన్స్ అయిపోయాయి. కొత్తగా నువ్వు ఇప్పుడు వచ్చి అలా మాట్లాడటం చాలా తప్పు. హీరో మంచి ‍వ్యక్తి. ప్రతి చిన్న సినిమా ఫంక్షన్‌కు విశ్వక్‌ సేన్ వస్తాడు. పరిచయం లేకపోయినా సరే పిలిస్తే వెళ్లి సపోర్ట్ చేస్తాడు. మా బాపు సినిమా ఈవెంట్‌కు వచ్చి గంటన్నర్ర కారులోనే కూర్చున్నాడు. లైలా ప్రమోషన్‌లో ఉండి కూడా మాకు మద్దతు తెలిపేందుకు వచ్చాడు. అలాంటి వ్యక్తి సినిమాకు వచ్చి నువ్వేదో మాట్లాడటం సరైన పద్ధతి కాదు.' అని అన్నారు.

(ఇది చదవండి: క్షమాపణలు చెప్పిన పృథ్వీరాజ్‌.. ఈ బుద్ధి ముందుండాలి!)

ప్రస్తుతం బ్రహ్మాజీ బాపు మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో ఆమని, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఈ సినిమాను దయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే బాపు ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్‌ చేశారు. ఈ సినిమాను కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీర బ్యానర్లపై రాజు, సీహెచ్‌ భాను ప్రసాద్‌ రెడ్డి నిర్మించారు.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)