Breaking News

అదృష్టం అంటే త్రిషదే.. పట్టుకుందల్లా బంగారమే!

Published on Wed, 11/08/2023 - 06:50

ఏ విషయానికైనా ప్రతిభ మాత్రమే ఉంటే చాలదు, కాస్తంత అదృష్టం కూడా ఉండాలి అని పెద్దలు అంటుంటారు. త్రిష విషయంలో ఇప్పుడదే జరుగుతోంది. 20 ఏళ్ల క్రితం జోడీ అనే చిత్రంలో నటి సిమ్రాన్‌కు స్నేహితురాలిగా ఒకటి రెండు సన్నివేశాల్లో కనిపించిన త్రిష అగ్ర కథానాయకిగా రాణిస్తుందని బహుశా ఆమె కూడా అనుకుని ఉండదు. అలాంటిది సామి, గిల్లి వంటి చిత్రాలు త్రిషను స్టార్‌ హీరోయిన్‌గా నిలబెట్టాయి. అలా తమిళంతోపాటు తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో కథానాయికగా నటించింది.

గోల్డెన్‌ ఛాన్స్‌ ఇచ్చిన మణిరత్నం
అయితే ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వచ్చి బెడిసి కొట్టిన ఘటన త్రిష కెరీర్‌ పై బలంగానే పడిందని చెప్పక తప్పదు. ఇప్పటివరకు ఈమె అవివాహిత గానే ఉండడం గమనార్హం. ఇక లేడీ ఓరియంటెడ్‌ కథా చిత్రాలు త్రిషకు అచ్చి రాలేదు. అలాంటిది త్రిషకు దర్శకుడు మణిరత్నం గోల్డెన్‌ ఛాన్స్‌ ఇచ్చాడు. పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో అవకాశం కల్పించారు. అందులో యువరాణి కుందవైగా నటించి అందరి ప్రశంసలు అందుకుంది. అలా పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రం రెండు భాగాలు హిట్‌ కావడంతో త్రిష పేరు మరోసారి మారుమోగింది.

అన్నీ మంచి శకునములే..
ఆ తర్వాత అన్నీ మంచి శకునములే అన్నట్టుగా వరుసగా స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాలు వరిస్తున్నాయి. ఇటీవల విజయ్‌ సరసన నటించిన లియో చిత్రం కూడా అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. అజిత్‌కు జంటగా విడాముయర్చి చిత్రంలో నటిస్తోంది. తదుపరి కమల్‌ హాసన్‌ సరసన నటించే లక్కీ ఛాన్స్‌ దక్కించుకుంది. మణిరత్నం ఈమెకు మరోసారి ఛాన్స్‌ ఇచ్చారు.. కమల్‌ హాసన్‌ 224వ చిత్రంలో ఈమెనే ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. అలా మరో మల్టీ స్టారర్‌ చిత్రంలో నటించే మెగా అదృష్టం ఈ చైన్నె సుందరిని వరించింది. ఇలా ఇప్పుడు త్రిష టైం నడుస్తోందన్నమాట.

చదవండి: భార్యతో విడాకులు తీసుకున్న స్టార్ సింగర్‌!

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?