CheviReddy: కూటమిపై తిరుగుబాటు.. రాబోయే స్థానిక ఎన్నికల్లో గుణపాఠం
Breaking News
తిరువీర్ బోల్డ్ క్యారెక్టర్.. 'భగవంతుడు' టీజర్ రిలీజ్
Published on Fri, 01/30/2026 - 14:04
జార్జిరెడ్డి, పలాస, టక్ జగదీష్ తదితర సినిమాల్లో సహాయ నటుడిగా ఆకట్టుకున్న తిరువీర్.. మసూద, పరేషాన్, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్రాలతో హీరోగానూ ప్రేక్షకుల్ని అలరించాడు. ఎక్కువగా అమాయకుడి తరహా పాత్రలతో అలరించిన తిరువీర్.. ఇప్పుడు బోల్డ్ క్యారెక్టర్ చేశాడు. ఆ మూవీనే 'భగవంతుడు'. ఈ చిత్ర టీజర్ ఇప్పుడు రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: మలయాళ హారర్ కామెడీ సినిమా.. 'సర్వం మాయ' రివ్యూ (ఓటీటీ))
విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. టైటిల్‌కి తగ్గట్లే పల్లెటూళ్లలో ఆచారాలు, దేవుడంటే నమ్మకం తదితర అంశాలతో సినిమా తీసినట్లు తెలుస్తోంది. తిరువీర్ సరసన ఫరియా అబ్దుల్లా నటించింది. వీళ్లిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి. రిషి ప్రతినాయక పాత్ర చేశాడు. ఈ వేసవిలో మూవీ థియేటర్లలోకి రానుందని ప్రకటించారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి ప్రభాస్ 'రాజాసాబ్'.. అధికారిక ప్రకటన)
Tags : 1