Breaking News

నెలకు ఇరవై కథలు వింటున్నాను

Published on Wed, 07/15/2026 - 01:25

తిరువీర్, ఐశ్వర్యా రాజేష్‌ జంటగా నటించిన చిత్రం  ‘ఓ..! సుకుమారి’. భరత్‌ దర్శన్‌ దర్శకత్వంలో మహేశ్వర్‌  రెడ్డి మూలి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో తిరువీర్‌ మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో నేనొక అప్‌కమింగ్‌  పొలిటీషియన్‌ పాత్రలో నటించాను. ఒక అమ్మాయి గుండె వేగం సాధారణ స్థాయిని దాటితే ఆమె శరీరం నుంచి ఎలక్ట్రిక్‌ షాక్‌ జనరేట్‌ అవుతుంది.

అలాంటి అమ్మాయి జీవితంలోకి ప్రేమించిన అబ్బాయి వచ్చిన తర్వాత ఏం జరిగింది? అన్నదే ఈ సినిమా కథాంశం. ఈ సినిమా కథ కొత్తగా, ఆసక్తిగా  ఉంటుంది. ప్రేక్షకులను నవ్వించడంతో పాటు భావోద్వేగానికి గురి చేస్తుంది. నేను నటించిన సినిమాలకు నిర్మాతలకు డబ్బులు వచ్చి, దర్శకుడికి పేరు వస్తే చాలనుకుంటాను. ఒకప్పుడు సినిమాల్లో నటించేందుకు నా ఫొటోలు తీసుకుని, ఆఫీసుల చుట్టూ తిరిగాను.

అలాంటిది ఇప్పుడు నాతో సినిమాలు చేస్తే బిజినెస్‌ జరుగుతోందని భావించి, దర్శక–నిర్మాతలు నాతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ లెక్కన నేను కంఫర్టబుల్‌ ప్లేస్‌లోనే ఉన్నానని అనుకుంటున్నాను. ఇక నెలకు దాదాపు 20 కథలు వింటాను. వీటిలో నాకు నచ్చిన కథలు చేస్తున్నాను. నా తర్వాతి చిత్రం ‘భగవంతుడు’ కొత్తగా ఉంటుంది. అలాగే అమెజాన్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నాను’’ అని అన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)