Breaking News

ప్రపంచంలోనే ఎత్తైన భవనం.. కోట్లు పెట్టి కొన్న సినీతారలు వీళ్లే..!

Published on Thu, 07/24/2025 - 17:47

బుర్జ్ ఖలీఫా.. ఈ పేరు తెలియని వారు దాదాపు ఉండరు. దుబాయ్‌లోని ఆకాశసౌధం ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా గుర్తింపు పొందింది. దుబాయ్ ట్రిప్ వెళ్లినవారు అక్కడ తప్పకుండా ఫోటోలు తీసుకోకుండా ఉండలేరు. అంతలా పర్యాటకంగా బుర్జ్ ఖలీఫా ఫేమస్‌ అయింది. అయితే ఇది కేవలం పర్యాటక ప్రాంతం మాత్రమే అనుకుంటే పొరపాటే. అంత ఎత్తైన శిఖరంలా కనిపించే ఈ ఆకాశం సౌధంలో నివాసానికి అనుగుణంగా తీర్చిదిద్దారు. అత్యంత విలాసవంతమైన నివాసాలకు నిలయంగా మార్చారు. ఈ లగ్జరీ లైఫ్‌ స్టైల్‌కు చిరునామాగా మారిన ఈ బుర్జ్‌ ఖలీఫాలో అపార్ట్‌మెంట్‌ కొనాలంటే కోట్లు కుమ్మరించాల్సిందే.

ఈ ప్రపంచంలోనే ఎ‍త్తైన ఈ భవనంలో నివసించాలని ఎవరు కోరుకోరు. ‍ఎన్ని కోట్లైనా సరే పెట్టేందుకు బడా వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు క్యూ కడతారు. అలా ఈ ఆకాశ సౌధంలో మన సినీతారలు సైతం అపార్ట్‌మెంట్స్‌ కొనేశారు. ఇందులో బాలీవుడ్ భామ శిల్పాశెట్టితో పాటు మలయాళ సూపర్ స్టార్‌ మోహన్ లాల్ ఖరీదైన ఫ్లాట్లను తమ సొంతం చేసుకున్నారు. ఆ వివరాలేంటో చూసేద్దాం.

బాలీవుడ్ ముద్దుగుమ్మ శిల్పాశెట్టి ఈ ఫ్లాట్‌ బహుమతిగా లభించింది. ఆమె భర్త, నటుడు రాజ్ కుంద్రా వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా బుర్జ్ ఖలీఫాలో లగ్జరీ ఫ్లాట్‌ను తన సతీమణికి గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆమె విలాసవంతమైన నివాసం 19వ అంతస్తులో ఉంది. దీని విలువ దాదాపు రూ. 50 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.

మోహన్ లాల్ స్వర్గధామం..

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సైతం బుర్జ్ ఖలీఫాలో అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేశారు. ఆయన 29వ అంతస్తులో లగ్జరీ ఫ్లాట్‌ను కొన్నారు. దాదాపు 940 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ అపార్ట్‌మెంట్‌లో ఆధునాతన సౌకర్యాలు ఉన్నాయి. దీని విలువ దాదాపు రూ. 3.5 కోట్లు ఉంటుందని అంచనా. అయితే ఈ ఫ్లాట్‌ను మోహన్ లాల్ తన భార్య సుచిత్ర మోహన్‌లాల్ పేరు మీద రిజిస్టర్ చేశారు. వీరితో పాటు కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ వి నీరియపరంబిల్‌కు ఈ భవనంలో దాదాపు 22 ఫ్లాట్స్‌ కొనుగోలు చేశారట. అందువల్లే ఆయనను బుర్జ్ ఖలీఫా రాజు ‍అని ముద్దుగా పిలుస్తారట.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)