Breaking News

శ్రావణమాస ఉపవాసం.. రాత్రి మటన్‌ వండుకుని తిన్నా: హీరోయిన్‌

Published on Sun, 07/27/2025 - 13:12

శ్రావణమాసంలో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు అంటూ ఎక్కువగా దైవారాధానలోనే మునిగిపోతారు. ఆధ్యాత్మికబాటలో నడుస్తున్నానని చెప్పిన హీరోయిన్‌ తనుశ్రీ దత్తా (Tanushree Dutta) కూడా శ్రావణ ఉపవాసం చేస్తోంది. కానీ మాంసాహారం తింటోంది. అదేంటో మీరే చదివేయండి..

చంపడానికి ప్రయత్నాలు
సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న తనుశ్రీ దత్తా ఇటీవల కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ వీడియో షేర్‌ చేసింది. నటుడు నానాపటేకర్‌.. తనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడంది. తన మనుషులతో రాత్రిపూట ఇంటి బయట శబ్దాలు చేస్తూ భయపెడుతున్నారంది. బాలీవుడ్‌ మాఫియా చాలా పెద్దదని, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌లాగే తననూ చంపడానికి ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేసింది. ఈ వీడియోలు వైరల్‌ కావడంతో ఇంటర్వ్యూల కోసం ఆమెను చాలామంది సంప్రదించారు. 

రోజంతా ఉపవాసం.. రాత్రవగానే..
దానికామె కొన్నేళ్లుగా ఆధ్యాత్మిక జీవనశైలికి అలవాటు పడ్డానని, అందుకే మీడియా ముందుకు రావడం లేదని పేర్కొంది. కట్‌ చేస్తే.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రావణమాసం సందర్భంగా మటన్‌ తింటున్నట్లు తెలిపింది. కొట్టు నుంచి తెచ్చుకున్న మటన్‌ను చూపిస్తూ.. రోజంతా తినకుండా ఉన్నానని, రాత్రి 7 గంటలకు మటన్‌ తిని ఉపవాసం పూర్తి చేశానంది. "ఎవరైనా మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా టార్చర్‌ చేస్తుంటే మీరు తినే ఆహారంపై శ్రద్ధ పెట్టండి. 

మటన్‌ వండుకుని తిన్నా
ఎందుకంటే ఆహారమే అసలైన మెడిసిన్‌. శ్రావణమాసం కావడంతో రాత్రి ఏడు గంటల వరకు ఉపవాసమున్నాను. ఆ తర్వాత అధిక పోషకాలున్న పప్పు, మటన్‌ వండుకుని డిన్నర్‌ చేశాను. ఉపవాసాలు మరీ కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి అవసరాలకు తగ్గట్లుగా వారు దాన్ని మార్చుకోవచ్చు. నాకైతే ఇలాంటి ఉపవాసమే బాగా పనిచేస్తుంది" అని చెప్పుఒకచ్చింది. 

అందుకే లావైపోతున్నావ్‌
శ్రావణంలో మటన్‌ తినడమేమో కానీ ఏకంగా ఉపవాసం రోజు మటన్‌ తినడమేంటని నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఓ వ్యక్తి అయితే నువ్వు కొవ్వు ఎక్కువగా తింటున్నావు, అందుకే లావవుతున్నావు అని కామెంట్‌ చేశాడు. దానికి తనుశ్రీ స్పందిస్తూ.. ముందుగా నా శరీరం గురించి కామెంట్‌ చేసేందుకు నీకు ఎటువంటి అర్హత లేదు. రెండోది.. బక్కపల్చగా లేనేమోకానీ ఫిట్‌గానే ఉన్నాను. ఎటువంటి డ్రెస్‌ వేసుకున్నా అందంగానే కనిపిస్తాను. కాబట్టి బొద్దుగా, అందంగా ఉండేవాళ్లను బాడీషేమింగ్‌ చేయడం ఆపండి. 

కొవ్వు మంచిదే!
ప్రతి ఒక్కరూ సన్నగా ఉండాలని కోరుకోరు. అయినా కాస్త కొవ్వు పదార్థాలు తిన్నంతమాత్రాన శరీరంలో కొవ్వు చేరదు. ఆరోగ్యకరమైన కొవ్వు తీసుకోవడం వల్ల సన్నగా కూడా అవుతారు. మన శరీరం బాగా పనిచేయడానికి హెల్తీ ఫ్యాట్స్‌ అవసరం అని చెప్పుకొచ్చింది. హిందీలో అనేక సినిమాలు చేసిన తనుశ్రీ దత్తా.. తెలుగులో వీరభద్ర మూవీలో యాక్ట్‌ చేసింది.

 

 

చదవండి: పిల్లలు కావాలి.. వాళ్లతో ఎంజాయ్‌ చేయాలనుంది: నాగచైతన్య

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)