దళపతి విజయ్ చివరి సినిమా.. రిలీజ్‌ తేదీ ఫిక్స్

Published on Mon, 03/24/2025 - 18:32

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ నటిస్తోన్న చివరి చిత్రం 'జననాయగన్‌'. ఈ సినిమాను పొలిటికల్ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు హెచ్‌ వినోద్‌  దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ చిత్రంలో నటి పూజా హెగ్డే, మమిత బైజు హీరోయిన్లుగా కనిపించనున్నారు. అంతేకాకుండా కోలీవుడ్ భామ శృతిహాసన్‌ అతిథి పాత్రలో మెరవబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే రాజకీయ పార్టీని ప్రారంభించిన విజయ్ వచ్చే ఎన్నికల్లో పోటీకి ముందు నటిస్తోన్న చివరి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్‌ పోస్టర్స్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి.

అయితే తాజాగా ఈ సినిమా గురించి ‍అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. ఈ పొలిటికల్ యాక్షన్‌ థ్రిల్లర్‌ను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. పొంగల్ పండుగ సందర్భంగా జనవరి 9, 2026న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేస్తామని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విజయ్ ప్రత్యేక పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా.. ఈ చిత్రంలో  బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌, నటి ప్రియమణి, దర్శకుడు గౌతమ్‌ మీనన్‌  ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు.

 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)