Breaking News

రిలీజ్‌కు ముందే రికార్డులు.. ఇండియన్‌-2ను అధిగమించిన విజయ్‌ చిత్రం!

Published on Tue, 09/03/2024 - 20:11

కోలీవుడ్ స్టార్‌, దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం ది గోట్. ఈ సినిమాకు వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది.

తాజాగా అడ్వాన్స్ బుకింగ్‌లతో  కమల్ హాసన్‌'ఇండియన్- 2' మూవీని అధిగమించి కొత్త రికార్డు సృష్టించింది. రిలీజ్‌కు ముందే అడ్వాన్స్‌ బుకింగ్‌తో రూ. 12.82 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. అంతకుముదు ఇండియన్-2 మూవీకి ముందస్తు బుకింగ్స్‌ ద్వారా రూ. 11.20 కోట్లు మాత్రమే వచ్చాయి. విడుదలకు ఇంకా ఒకరోజు సమయం ఉడండంతో మరిన్ని రికార్డులు కొల్లగొట్టే అవకాశముంది. కేవలం బాక్సాఫీస్ వద్ద ప్రీ టికెట్‌ బుకింగ్స్‌తోనే రూ.20 కోట్లకు పైగా బిజినెస్ జరగవచ్చని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొదటి రోజే అత్యధిక వసూళ్లతో ది గోట్ కోలీవుడ్‌లో రికార్డ్‌ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. విజయ్ చివరిసారిగా లియో చిత్రంలో నటించారు. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)