Breaking News

విజయ్‌ డబుల్‌ రోల్‌.. జ్యోతికతో పాటు మరో హీరోయిన్‌ కూడా!

Published on Wed, 08/23/2023 - 10:29

దళపతి విజయ్‌ ఇద్దరు భామలతో కలిసి నటించి చాలాకాలం అయ్యింది. అప్పుడెప్పుడో 2007లో అళగియ తమిళ్‌ మగన్‌ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసి శ్రియ, నమితలతో రొమాన్స్‌ చేశారు. ఆ తర్వాత బిగిల్‌ సినిమాలో విజయ్‌ ద్విపాత్రాభినయం చేసినా ఇద్దరు హీరోయిన్లతో నటించలేదు. తాజాగా లియో చిత్రంలో త్రిష, ప్రియా ఆనంద్‌లు విజయ్‌తో జత కట్టారు.

లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇది రెండు భాగాలుగా విడుదల కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. కాగా విజయ్‌ తర్వాత వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. విశేషం ఏంటంటే ఇందులో విజయ్‌ మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలిసింది.

ఈ చిత్రంలో నటి జ్యోతిక విజయ్‌ సరసన నటించనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. తాజాగా మరో హీరోయిన్‌గా నటించే అవకాశం నటి ప్రియాంక మోహన్‌ను వరించిందని సమాచారం. దీనికి యువన్‌ శంకర్‌రాజా సంగీతాన్ని, సిద్ధార్థ చాయాగ్రహణం అందించనున్నారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం సెప్టెంబర్‌ నెలలో సెట్‌ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇది విజయ్‌ నటించే 68వ చిత్రం. దీనికి సంబంధించి పూర్తి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

చదవండి: అనిరుద్‌ గురించి విజయ్‌ దేవరకొండ వైరల్‌ కామెంట్స్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)