Breaking News

ప్రముఖ నటుడి ఇంట పెళ్లి సందడి.. క్రికెటర్‌తో కూతురి పెళ్లి

Published on Mon, 08/21/2023 - 18:52

ప్రముఖ నటుడు తలైవాసల్‌ విజయ్‌ ఇంట పెళ్లిబాజాలు మోగాయి. తమిళనాడు క్రికెటర్‌ అపరాజిత్‌తో విజయ్‌ కూతురు జయవీణ ఏడడుగులు నడిచింది. చెన్నైలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం ఉదయం వీరి వివాహం జరిగింది. కొద్ది నెలల క్రితమే వీరి ఎంగేజ్‌మెంట్‌ జరగ్గా నేడు మూడుముళ్ల బంధంలో అడుగుపెట్టారు. పలువురు సెలబ్రిటీలు వీరి వివాహ వేడుకకు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. సోషల్‌ మీడియాలోనూ అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

పెళ్లికూతురు జయవీణ విషయానికి వస్తే.. ఆమె కూడా క్రీడాకారిణి. స్విమ్మింగ్‌ పోటీల్లో జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకుంది. పెళ్లికొడుకు బాబా అపరాజిత్‌ క్రికెటర్‌గా రాణిస్తున్నాడు. 2012లో జూనియర్‌ వరల్డ్‌ కప్‌లో పాల్గొన్న అతడు 2013లో దులీప్‌ ట్రోఫీలో రెండు సెంచరీలు కొట్టాడు. ప్రస్తుతం అతడు చెపాక్‌ సూపర్‌ గిల్లీ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, వీరి లవ్‌ స్టోరీకి పెద్దలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి అధికారికంగా ఈ పెళ్లి జరిపించారని తెలుస్తోంది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

నటుడు విజయ్‌ విషయానికి వస్తే.. ఈయన తలైవాసి చిత్రంతో 1992లో వెండితెరపై అరంగేట్రం చేశాడు. తొలి సినిమాతోనే పేరుప్రఖ్యాతలు సంపాదించాడు. అలా ఆయన పేరు తలైవాసి విజయ్‌గా స్థిపరడిపోయింది. 30 ఏళ్ల కెరీర్‌లో 260కు పైగా చిత్రాలు చేశారు. తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనే కాకుండా తెలుగు, ఇంగ్లీష్‌ చిత్రాల్లోనూ నటించాడు. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గానూ ఎందరో నటులకు తన గొంతు అరువిచ్చాడు.

చదవండి: 400కు పైగా సినిమాలు, మోసం చేసిన కూతురు.. చితికి డబ్బుల్లేని దుస్థితి.. ఈ కష్టం ఎవరికీ రాకూడదు!

Videos

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)