క్రూర మృగాల్లా వెంట పడుతున్న వీధి కుక్కలు
Breaking News
ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
Published on Mon, 03/30/2026 - 18:43
హీరోయిన్లు వయసు అయిపోయిన తర్వాత సహాయ పాత్రలు చేస్తూ కాలం గడిపేస్తుంటారు. ఒకప్పటి హీరోయిన్ రాధిక కూడా అలానే తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తోంది. ఈమెని ప్రధాన పాత్రలో పెట్టి, తమిళ హీరో శివకార్తికేయన్ ఓ చిత్రాన్ని నిర్మించాడు. ఊహించని విధంగా బ్లాక్‌బస్టర్ అయింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులోకి రానుంది?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి శివాజీ-లయ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)
రాధిక.. వృద్ధురాలిగా నటించిన సినిమా 'తాయ్ కిళవి'. ఫిబ్రవరి 27న తమిళంలో మాత్రమే థియేటర్లలో రిలీజైంది. మంచి టాక్‌తో పాటు అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకుంది. లాంగ్ రన్లో రూ.80 కోట్ల వరకు వసూళ్లు దక్కించుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 10 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.
'తాయ్ కిళవి' విషయానికొస్తే.. కోపం ఎక్కువగా ఉండే ఓ బామ్మ(రాధిక), ఊరిలో అందరికీ డబ్బులు వడ్డీలకు ఇస్తూ కాలం వెల్లదీస్తుంటుంది. ముక్కుసూటిగా మాట్లాడటం, తేడా వస్తే చితక్కొట్టేయడం ఈమెకు అలవాటు. తన ముగ్గురు కొడుకులకు బాధ్యత లేకపోవడంతో వాళ్లని ఇంటి నుంచి గెంటేస్తుంది. అయితే ఈమె దగ్గర బంగారు నిధి ఉందనే ప్రచారం ఒకటి మొదలవుతుంది. మరోవైపు హఠాత్తుగా పక్షవాతం వచ్చేసరికి ఈమెకు మాట పడిపోతుంది. దీంతో కొడుకులు తిరిగి ఈమె దగ్గరకొస్తారు. వాళ్లకు సైగ ద్వారా ఏదో చెప్పాలనే ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతకీ అదేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్)
Tags : 1