Breaking News

మరో ఓటీటీలో 'టెనెంట్‌' సినిమా స్ట్రీమింగ్‌

Published on Fri, 06/28/2024 - 17:54

టాలీవుడ్‌లో సత్యం సినిమాతో పాపులర్‌ అయిన నటుడు 'రాజేశ్'. ఈ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు రావడంతో సత్యం రాజేశ్‌గా ఇండస్ట్రీలో సత్తా చాటాడు. పొలిమేర సినిమాతో మరింత పాపులర్‌ అయ్యాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం'టెనెంట్'. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం గత నెలలో థియేటర్లలోకి వచ్చింది. ఆపై జూన్ 7 నుంచి అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఇప్పుడు మరో ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది.

వెండితెరపై టెనెంట్‌ చిత్రం పెద్దగా మెప్పించలేదు. కానీ, ఓటీటీ విషయంలో మాత్రం ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో కూడా 'టెనెంట్' ఎంట్రీ ఇచ్చింది. నేటి నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది.  వై.యుగంధర్‌ తెరకెక్కించిన 'టెనెంట్‌' చిత్రాన్ని ఎమ్‌.చంద్రశేఖర్‌ రెడ్డి నిర్మాతగా ఉన్నారు. ఇందులో మేఘా చౌదరి, చందన పయ్యావుల, భరత్ కాంత్ లాంటి వాళ్లు నటించారు.

'టెనెంట్' విషయానికొస్తే.. గౌతమ్, సంధ్య పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారు. కానీ వీళ్ల జీవితంలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. సంధ్య వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆమెకు ఏమైందోనని గౌతమ్ తెలుసుకునేలోపే ఇంట్లోనే బెడ్‌పై శవమై కనిపిస్తుంది. అప్పుడే వీళ్లుంటున్న అపార్ట్‌మెంట్‌ పైనుంచి ఓ యువకుడు కిందకు దూకి ఆ‍త్మహత్య చేసుకుంటాడు. అసలు సంధ్యది హత్య? ఆత్మహత్య? గౌతమే ఆమెని చంపేశాడా? చనిపోయిన కుర్రాడు ఎవరు? పోలీసుల దర్యాప్తులో బయటకొచ్చిన నిజాలేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)