Breaking News

నిర్మాతల మండలి సంచలన నిర్ణయం.. సంక్రాంతికి మొదట ఆ చిత్రాలకే ..!

Published on Sun, 11/13/2022 - 14:35

తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎగ్జిబిటర్లకు లేఖ రాసింది. వచ్చే ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ సినిమాల ప్రదర్శనకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని లేఖలో వెల్లడించింది. 2017లో జరిగిన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అత్యవసర మీటింగ్‌లో ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సంక్రాంతి, దసరా పండుగలకు తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని లేఖలో స్పష్టం చేసింది. 

ఈ విషయంపై ఫిల్మ్‌ చాంబర్‌ ఉపాధ్యక్షుడు దిల్‌రాజు 2019లో ఇదే అంశాన్ని ప్రస్తావించారని గుర్తు చేసింది. టాలీవుడ్ చిత్రాలు ఉండగా.. డబ్బింగ్‌ చిత్రాలకు ఎలా ప్రాధాన్యత ఇస్తారని గతంలో దిల్‌ రాజు ప్రశ్నించారు. అందువల్లే ఈ నిర్ణయాన్ని ఎగ్జిబిటర్లు తప్పకుండా పాటించాలని లేఖలో వివరించింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమను కాపాడుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతల మండలి లేఖలో ప్రస్తావించింది. సంక్రాతి, దసరా పండుగల సమయంలో తెలుగు సినిమాలకు మొదటి ప్రాధ్యానత ఇస్తూ మిగిలిన థియేటర్లను మాత్రమే డబ్బింగ్ సినిమాలకు కేటాయించాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సినిమా ఎగ్జిబిటర్స్‌ను కోరింది. 

Videos

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

ప్లాప్ సినిమాకు ఎందుకంత బిల్డప్ : Perni Nani

జగన్ హయాంలో స్కాం జరగలేదని స్పష్టంగా తెలుస్తుంది: పోతిన మహేష్

తెలంగాణలో అసలైన పొలిటికల్ దెయ్యం ఎవరు..?

Photos

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)