Breaking News

ప్రముఖ దర్శకుడు వైవీఎస్‌ చౌదరి తల్లి కన్నుమూత

Published on Fri, 09/26/2025 - 10:03

ప్రముఖ దర్శకుడు వైవీఎస్‌ చౌదరి (Y. V. S. Chowdary) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి యలమంచలి రత్నకుమారి (88) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె గురువారం (సెప్టెంబర్‌ 25) రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని దర్శకుడు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా తల్లితో తన అనుబంధాన్ని, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 

ఏ లోటూ రాకుండా పెంచింది
మా అమ్మ.. ‘యలమంచిలి రత్నకుమారి’గారు ఒక స్త్రీశక్తి. లారీడ్రైవర్‌ అయిన మా నాన్న ‘యలమంచిలి నారాయణరావు’గారి నెలసరి సంపాదనతో.. తన ముగ్గురు బిడ్డలకు పౌష్టికాహారం, బట్టలు, అద్దె ఇల్లు, విద్య, వైద్యం అందించేది. అంతేకాదు, సినిమాలు చూపించడం దగ్గరి నుంచి దేవాలయ దర్శనాలు, సీజనల్‌ పిండివంటలు, నిల్వ పచ్చళ్ళు, పండుగలకు ప్రత్యేక వంటకాలు, సెలబ్రేషన్స్.. ఇత్యాది అవసరాలకు.. ఎటువంటి లోటు రాకుండా.. తన నోటి మీది లెక్కలతోనే బడ్జెట్‌ని కేటాయించిన ఆర్ధిక రంగ నిపుణురాలు మా అమ్మగారు.

మాలో స్ఫూర్తి నింపింది
వీటన్నింటికీ మించి నిత్యం తెల్లవారుజామునే లేస్తూ పనిమనిషి ప్రమేయం లేని జీవితాన్ని తన బిడ్డలకు అందించాలనే తపనతో.. అన్నీ తానై మమ్మల్ని పెంచటానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శమూర్తి మా అమ్మగారు.. అలా మా అమ్మగారికి తెలిసిన లెక్కలు, ఆవిడ మమ్మల్ని పెంచిన విధానం ఏ చదువూ, ఏ విద్యా నేర్పించలేనిది. అంతేగాకుండా తన విధానాలతో మాలో కూడా స్ఫూర్తిని నింపిన మహనీయురాలు మా అమ్మగారు. 

సినిమా
అటువంటి మా అమ్మగారు (88 యేళ్ళు) 25వ సెప్టెంబరు 2025, రాత్రి 8.31 గంటలకు.. ఈ భువి నుంచి సెలవు తీసుకుని.. ఆ దివిలో ఉన్న మా నాన్నగారిని, మా అన్నగారిని కలవడానికి వెళ్ళిపోయారు అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టారు. వైవీఎస్‌ చౌదరి విషయానికి వస్తే.. శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి సినిమాతో దర్శకుడిగా మారారు. సీతారామరాజు, యువరాజు సినిమాలు చేశారు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు, రేయ్‌ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించారు.

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు