Breaking News

బిగ్‌బాస్‌ హౌస్‌లో గుడ్డు గోల.. భరణిపై రెచ్చిపోయిన మాస్క్ మ్యాన్‌!

Published on Wed, 09/10/2025 - 20:04

తెలుగు బుల్లితెర ప్రియుల్లో ‍అత్యంత క్రేజ్ ఉన్న రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్‌-9 గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈనెల 7న 15 మంది కంటెస్టెంట్స్‌ హౌస్‌లో అడుగుపెట్టారు. ఈ సారి భిన్నంగా కామన్ కేటగిరీ నుంచి ఏకంగా ఆరుగురిని పంపించారు. ఈ సీజన్‌లో బిగ్‌బాస్‌లో తొమ్మిది మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టారు. అయితే ప్రారంభమైన మూడు రోజులకే నామినేషన్స్‌తో హౌస్‌ను హీటెక్కించారు బిగ్‌బాస్‌. తొలివారంలో ఏకంగా తొమ్మిదిమంది నామినేట్ అయ్యారు. ఈసారి నామినేషన్లలో రీతూ చౌదరి, సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ, సంజన గల్రానీ, శ్రష్ఠి వర్మ, రాము రాథోడ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, డీమన్ పవన్ ఉన్నారు.

అయితే తాజాగా ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను బిగ్‌బాస్‌ మేకర్స్ విడుదల చేశారు. ‍అయితే ఈరోజు జరిగే ఎపిసోడ్‌లో కేవలం గుడ్డు కోసం హౌస్ సభ్యులంతా గొడవకు దిగారు. ఎవరు గుడ్డు తిన్నారు అంటూ హౌస్‌మేట్స్‌ను ప్రశ్నించగా.. నేనైతే తినలేదండి.. ప్రామిస్ అంటూ సంజనా గల్రానీ అన్నారు. నీవల్లే అందరికీ ప్రాబ్లం అంటూ సంజనాతో భరణి వాదించారు. దీంతో భరణిపై మాస్క్ మ్యాన్ హరీశ్‌ ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. మీరు టాపిక్‌ను డైవర్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. నేను మీకంటే బాగా చేస్తానని మాస్క్ మ్యాన్ అన్నారు. దీంతో భరణికి, హరీశ్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. హౌస్‌మేట్స్ అంతా వీరిద్దరికీ నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన ప్రోమో ఎపిసోడ్‌పై మరింత ఆసక్తిని పెంచేసింది. ఇంకెందుకు ఆలస్యం బిగ్‌బాస్ ప్రోమో చూసేయండి.

Videos

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)