Breaking News

బిగ్‌బాస్ తెలుగు సీజన్‌-9.. కంటెస్టెంట్స్‌ లిస్ట్‌లో ఉన్నది ఎవరంటే?

Published on Fri, 09/05/2025 - 08:49

టాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్‌బాస్ వచ్చేస్తున్నాడు. ఈ ఆదివారం నుంచే బిగ్‌ రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్‌ ఫైనల్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌ కోసం కామన్ కేటగిరి నుంచి అగ్ని పరీక్ష పేరుతో కంటెస్టెంట్స్‌ను‌ ఎంపిక చేయనున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే దాదాపు పూర్తయినట్లే తెలుస్తోంది. ఈ కేటగిరీలో ఐదు నుంచి ఆరుమందిని ఎంపిక చేస్తారని సమాచారం..

ఇక బిగ్‌బాస్‌పై రివ్యూలు చేస్తోన్న మాజీ కంటెస్టెంట్‌ ఆదిరెడ్డి ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్స్‌ ఎవరన్నది రివీల్‌ చేశారు. ఇది అఫీషియల్ కాకపోయినా.. కాస్తా అటు.. ఇటు కూడా వీరిలో కొందరైనా ఉండొచ్చు. ఆదిరెడ్డి అనలైసిస్ ప్రకారం రీతూ చౌదరి, ఇమ్మానియేల్, రాము రాథోడ్, తనూజా గౌడ, ఆశా షైనీ, భరణి శంకర్, సుమన్ శెట్టి, శ్రష్టి వర్మ, సంజనా గార్లానీ లాంటి సెలబ్రీటీలు ఉండొచ్చని అంచనా వేశారు.

అలాగే కామన్ మ్యాన్ కేటగిరి నుంచి ఐదు నుంచి ఆరుగురిని సెలెక్ట్‌ చేస్తారని చెప్పుకొచ్చారు. వారిలో మాస్క్‌ మ్యాన్ హరీశ్, మర్యాద మనీశ్, శ్రీజ, ఆర్మీ పవన్ కల్యాణ్, ప్రియా, పవన్ పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆదిరెడ్డి అంచనా వేశారు. ఈ లిస్ట్‌లో ఉన్నవారంతా బిగ్‌బాస్‌ హౌస్‌లో కనిపిస్తారా? లేదా అన్నది తెలియాలంటే ఏడో తేదీ వరకు ఆగాల్సిందే. కాగా.. సెప్టెంబర్‌ 7న బిగ్‌బాస్‌ సీజన్ 9 ప్రారంభం కాబోతుందని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా కింగ్‌ నాగార్జునే ఈ రియాలిటీ షోకి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి