Breaking News

అందుకే సినిమాలు చేయడం మానేశా: నటి హేమ

Published on Sun, 02/12/2023 - 09:21

ప్రముఖ నటి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ హేమ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వెండితెరపై అక్క, వదిన, భార్య వంటి పాత్రలు పోషించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఎక్కువగా కమెడియన్ల సరసన నటించిన ఆమె తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించింది. భర్తను కనుసన్నల్లో పెట్టి ఆడించే భార్యగా హేమ పరకాయ ప్రవేశం చేసి నటించేది. అలా ఇండస్ట్రీలో నటిగా తనకంటూ స్పెషల్‌ ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్న హేమ ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు.

చదవండి: క్యాన్సర్‌ బారిన ఆటో రామ్‌ ప్రసాద్‌? క్లారిటీ ఇచ్చిన నటుడు

గత మా ఎలక్షన్స్‌లో చురుగ్గా కనిపించిన ఆమె పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటోందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె తను సినిమాలు చేయకపోవడానికి కారణం వెల్లడించింది. కమెడియన్‌ కిరాక్‌ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్‌ రెండవ బ్రాంచ్‌ను ఇటీవల మణికొండలో స్టార్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రారంభోత్సవానికి హాజరైన హేమ ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించింది.

చదవండి: ప్రకాశ్‌ రాజ్‌ కామెంట్స్‌పై ఘాటుగా స్పందించిన కశ్మీర్‌ ఫైల్స్‌ డైరెక్టర్‌

ఈ సందర్భంగా ఈ మధ్య సినిమాల్లో కనిపించడం లేదు ఎందుకు? అనే ప్రశ్న ఆమెకు ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘ఈ మధ్య కొత్త బిజినెస్‌ పెట్టాను. అందులో మంచి లాభాలు వస్తున్నాయి. సంపాదన ఎక్కువ అవడంతో సుఖ పడటం అలవాటు అయిపోయింది. కష్టపడటానికి ఇష్టపడటం లేదు అంతే’ అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. అయితే అది ఎలాంటి బిజినెస్‌ అనేది మాత్రం ఆమె చెప్పేందుకు ఆసక్తి చూపలేదు. సమయం వచ్చినప్పుడు చెప్తానంటూ మాట దాటేసింది. 

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)