Breaking News

పవన్ కల్యాణ్ ఓజీకి బిగ్‌ షాక్..!

Published on Mon, 09/29/2025 - 21:29

పవన్‌ కల్యాణ్ ఓజీ సినిమాకు తెలంగాణలో బిగ్‌ షాక్ తగిలింది. ఈ సినిమా టికెట్‌ ధరల పెంపును రద్దు చేయాలంటూ తెలంగాణ పోలీస్‌ శాఖ జీవో రిలీజ్ చేసింది. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని సింగిల్‌ స్క్రీన్స్‌, మల్టీప్లెక్స్‌ యాజమాన్యాలను ఆదేశించింది. ఓజీ టికెట్ రేట్స్ పెంపును తెలంగాణ హైకోర్టు సస్పెండ్‌ చేసిన తర్వాత.. జరిగిన పరిణామాలను పోలీస్ శాఖ తన జీవోలో ప్రస్తావించింది. అంతకుముందు ప్రీమియర్‌ షోలతో పాటు అక్టోబరు 4 వరకు టికెట్‌ రేట్లు పెంచుకోవచ్చని తెలంగాణ గవర్నమెంట్‌ అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే.

టికెట్ రేట్లపై పిటిషన్

ఓజీ టికెట్ రేట్ల పెంపును సవాల్ చేస్తూ మహేశ్‌ యాదవ్‌ అనే వ్యక్తి హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం ఆ ఉత్తర్వులను సస్పెండ్‌ చేస్తూ.. జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ ఈ నెల 24న ఆదేశాలు జారీ చేశారు. ఈ సినిమా టికెట్‌ రేట్లపై సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్‌ బెంచ్‌ ఈ నెల 26 వరకు స్టే విధించింది. రివ్యూ పిటిషన్‌పై ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. టికెట్‌ ధరలు పెంచడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇటీవల హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబరు 9వ తేదీకి వాయిదా వేసింది. అంతేకాకుండా టికెట్‌ ధరలు ఎందుకు పెంచాలనుకుంటున్నారో కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది.
 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)