Breaking News

విచారణలో 'ఐబొమ్మ' సినిమా చూపించిన రవి

Published on Fri, 11/21/2025 - 07:44

‘ఐబొమ్మ’ పైరసీ సినిమా వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.   ప్రస్తుతం జ్యుడీషియల్‌ రిమాండ్‌లో భాగంగా చంచల్‌గూడ జైలులో ఉన్న రవిని దర్యాప్తు అధికారులు  కస్టడీలోకి తీసుకుని ఐదు రోజులపాటు విచారించనున్నారు. ఈ క్రమంలో రవిని పోలీసులు మొదటిరోజు విచారించారు. అందులో భాగంగా రవి 'నేను ఒంటరిని… మీ ఇష్టం వచ్చింది చేసుకోండి' అంటూ ఎలాంటి భయం లేకుండా అధికారులు  అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పారట. అతని కోసం వెళ్లిన న్యాయవాదులను కూడా కలిసేందుకు అతను ఇష్టపడలేదట. తన స్నేహితుడు వస్తాడని మాత్రం చెప్పినట్లు తెలుస్తోంది. తనది ఒంటరి జీవితమని..  పట్టించుకునేవారు ఎవరూ లేరని చెబుతూనే.. మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి అని పోలీసులతో రవి పేర్కొన్నాడట.

విచారణలో భాగంగా చంచల్‌గూడ జైలు నుంచి రవిని సీసీఎస్‌కు   పోలీసులు తీసుకొచ్చారు. మొదటిరోజు  విచారణలో అతని నెట్‌వర్క్‌ గురించి తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. విడుదలైన సినిమాను ఎలా పైరసీ చేస్తాడు.. ఆపై ఎలా ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తాడు వంటి అంశాలను రవి నుంచి రాబట్టారట. అయితే, రవి కూడా అధికారులకు పూర్తిగా సహకరించారట. నాకు తెలియదు, చెప్పను అనే సినిమా డైలాగ్స్‌ పేల్చకుండా విచారణ అధికారులకు తన వెబ్‌సైట్‌ను ఎలా నిర్వహిస్తాడో చెప్పాడట. ఐబొమ్మ సినిమాను పోలీసులకు  కళ్లకు కట్టినట్టు చూపించాడట.

అప్పుడే విడుదలైన సినిమాను  ఎక్కడ రికార్డ్‌ చేస్తారు..? క్వాలిటీ ఎలా పెంచుతారు..? వంటి అంశాలతో పాటు ఐబొమ్మ సర్వర్‌లోకి ఎలా పంపుతారనే అంశాలన్ని చాలా క్లియర్‌గా రవి వివరించాడట. ఈ క్రమంలో ఏమైనా టెక్నికల్‌ సమస్యలు వస్తే వాటిని అధిగమించే ప్లాన్‌ను కూడా పంచుకున్నాడట. తన కోసం పనిచేసే ఏజెంట్లు కూడా ఉన్నట్లు తెలిపాడట. వాళ్లకు కొంత డబ్బులిచ్చి సినిమా ప్రింట్‌ తీసుకుంటానని రవి చెప్పాడట. సినిమా విడుదలకు ముందే క్యూబ్‌ను ఏ విధంగా హ్యాక్‌ చేస్తారో కూడా రవి వివరంగా తెలిపాడట.

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)