Breaking News

మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు

Published on Mon, 12/23/2024 - 15:22

ప్రముఖ నటుడు మోహన్ బాబుకి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ని న్యాయస్థానం కొట్టేసింది. అనారోగ్యంతో ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు కానీ అది నెరవేరలేదు. దీంతో మోహన్ బాబుని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇకపోతే మోహన్ బాబు ఇండియాలోనే ఉన్నట్టు ఆయన న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేశారు. తన మనవరాలును చూసేందుకు దుబాయ్ వెళ్లి తిరుపతి వచ్చినట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని న్యాయవాది రవిచందర్ చెప్పారు. మోహన్ బాబు మెడికల్ రిపోర్ట్ చూపించాలని హైకోర్టు కోరడంతో.. కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్ పర్యవేక్షణలో మెడికేషన్‌లో ఉన్నారని తెలిపారు. దీంతో పాటు జర్నలిస్ట్ స్టేట్‌మెంట్ కాపీని కూడా హైకోర్టు పరిశీలించింది.

(ఇదీ చదవండి: కూటమి పార్టీల్లో ‘బెనిఫిట్‌ షో’ వివాదం)

ఇంతకీ ఏం జరిగింది?
మోహన్ బాబు ఇంట్లో కుటుంబ సమస్యలు ఉన్నాయి. దీంతో మనోజ్-మోహన్ బాబు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని తొలుత రూమర్స్ వచ్చాయి. అది నిజమో కాదో పక్కనబెడితే పరస్పరం పోలీసు కేసులు అయితే పెట్టుకున్నారు. కొన్నిరోజుల క్రితం ఓ మూడు నాలుగు రోజుల పాటు ఈ గొడవ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. ఈ క్రమంలోనే మోహన్ బాబు ఇంటి దగ్గరకు మీడియా ప్రతినిధులు వెళ్లగా.. జర్నలిస్టుపై మైకుతో మోహన్ బాబు దాడి చేశారు. దీంతో తలకు గాయలయ్యాయి.

ఆ తర్వతా సదరు జర్నలిస్టుకు క్షమాపణ చెప్పడంతో పాటు స్వయంగా ఆస్పత్రికి వెళ్లి కూడా మోహన్ బాబు పరామర్శించారు. అదలా ఉంచితే దాడి జరిగిన తర్వాత రోజే అనారోగ్య సమస్యలతో మోహన్ బాబు ఆస్పత్రిలో చేరారు. కొన్నిరోజుల పాటు తనని అరెస్ట్ చేయకుండా కోర్టు అనుమతి తెచ్చుకున్నారు. ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయగా.. దాన్ని తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఒకవేళ కావాలంటే దిగువ కోర్టుకు వెళ్లాలని సూచించింది.

మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత!

(ఇదీ చదవండి: ఎన్టీఆర్‌ ఇంతవరకు సాయం చేయలేదు.. అభిమాని తల్లి ఆవేదన)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)