Breaking News

వ్యూహం రిలీజ్‌ మరింత ఆలస్యం

Published on Mon, 01/22/2024 - 10:42

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా రిలీజ్‌కు లైన్‌ క్లియర్‌ కాలేదు. ఈ మూవీపై పలు దఫాలు విచారణ చేపట్టిన హైకోర్టు నేడు(జనవరి 22న) సెన్సార్‌ సర్టిఫికెట్‌ను తిరిగి సెన్సార్‌ బోర్డుకు పంపించింది. మూడు వారాల్లో సినిమాను మళ్లీ పరిశీలించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కాగా వ్యూహం సినిమా రిలీజ్‌ను నిలిపివేయాలంటూ టీడీపీ నేత నారా లోకేశ్‌ కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. వ్యూహం చిత్రానికి సెన్సార్‌ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్‌ చట్టవిరుద్ధమని పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జనవరి 11 వరకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ వ్యూహం నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సినిమా వాయిదా వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోందని విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 8న సెన్సార్‌ బోర్డ్‌.. వ్యూహం సెన్సార్‌ సర్టిఫికెట్‌తో పాటు సంబంధిత రికార్డులను న్యాయస్థానానికి అందజేసింది. అన్నింటిపై సమగ్ర విచారణ జరిపిన న్యాయస్థానం సెన్సార్‌ సర్టిఫికెట్‌ను పునఃపరిశీలించమని సెన్సార్‌ బోర్డును ఆదేశించింది. దీంతో వ్యూహం రిలీజ్‌ మరింత ఆలస్యం కానుంది.

whatsapp channel

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)