Breaking News

చిత్ర పరిశ్రమ కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌: దిల్‌ రాజు

Published on Tue, 09/16/2025 - 07:44

సినీ రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్‌ విండో ద్వారా  ఒక సినిమాకు కావాల్సిన అనుమతులన్నీ ఇచ్చేలా ఫిలిమ్స్‌ ఇన్‌ తెలంగాణ పేరుతో  ఒక వెబ్‌సైట్‌ రూపొందించనున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సినిమా షూటింగ్‌  అనుమతులకు, థియేటర్స్‌ నిర్వహణలకు పొందాల్సిన అనుమతల్ని ఈ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు. ఈమేరకు హైదరబాద్‌లో ప్రత్యేక వర్క్‌ షాప్‌ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌రాజుతో పటాఉ ఎఫ్‌డీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సి.హెచ్‌.ప్రియాంక, టూరిజం కార్పొరేషన్‌ ఎండీ  క్రాంతి పాల్గొన్నారు.

తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఎంతో సానుకూలంగా ఉన్నారని దిల్‌ రాజు చెప్పారు. సినీ నిర్మాతలు కేవలం స్క్రిప్ట్‌తో వచ్చినా సరే వారి సినిమాకు కావాల్సిన షూటింగ్‌ లొకేషన్లతో పాటు అందుకు కావాల్సిన అనుమతులు సింగిల్‌ విండో ద్వారా లభిస్తాయన్నారు. సినిమా థియేటర్ల నిర్వహణకు కావాల్సిన బీ-ఫామ్‌ను చాలా సులువుగా ఆన్‌లైన్‌ ద్వారా పొందేలా కొత్త విధానాన్ని ప్రవేశ పెడుతున్నట్లు ఆయన అన్నారు. 

థియేటర్ల నిర్వహణ కోసం ఇప్పటి వరకు ఉన్న పద్ధతుల్లో మార్పులు చేస్తున్నట్లు చెప్పారు. ఈ వెబ్‌సైట్‌ను రూపొందించేందుకు  చిత్ర పరిశ్రమ ప్రతినిధుల నుంచి పలు సలహాలతో పాటు సూచనలు తీసుకుంటామన్నారు.  వెబ్‌సైట్‌ను పూర్తి స్థాయిలో రూపొందించాక సీఎం రేవంత్‌ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో ప్రారంభిస్తామని  దిల్‌ రాజు అన్నారు.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)