Breaking News

తెలంగాణలో బెనిఫిట్ షోలు బంద్?

Published on Fri, 12/06/2024 - 11:21

'పుష్ప 2' కోసం బుధవారం రాత్రి ప్రీమియర్లు వేశారు. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లోనూ ఇలానే ముందస్తు షోలు వేశారు. ఊహించని విధంగా అక్కడికి ఆ రోజు హీరో అల్లు అర్జున్ రావడంతో ప్రేక్షకుల మధ్య తోపులాట జరిగింది. ఈ సంఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బన్నీ టీమ్‌పై కేసు కూడా నమోదైంది.

(ఇదీ చదవండి: 'పుష్ప 2' కలెక్షన్స్.. హిందీలో బన్నీ బ్రాండ్ రికార్డ్!)

ఇలా మహిళ మృతి చెందడంపై నిర్మాతలు స్పందించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని కూడా హామీ ఇచ్చారు. ఏదేమైనా ఇలా ఓ మహిళ చనిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇకపై తెలంగాణలో రిలీజయ్యే కొత్త సినిమాలకు బెన్‌ఫిట్ షోలకు అనుమతి ఇవ్వం అని సినిమాటోగ్రాఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. నగరంలో బెనిఫిట్ షోలు వేయడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని కోమటిరెడ్డి అన్నారు. కుటుంబంతో కలిసి సరదాగా సినిమా చూసేం దుకు వచ్చినవారు తమ కుటుంబ సభ్యురా లిని కోల్పోవడం తనను ఎంతో బాధించిందని చెప్పారు.

ఇకపై తెలంగాణలో ఉదయం 7 గంటలకే తొలి షో ఉండే అవకాశముంది. అంతకంటే ముందు మాత్రం బెన్‌ఫిట్ ఉండవు. టికెట్ రేట్ల విషయంలోనూ ప్రభుత్వాలపై బాగానే విమర్శలు వచ్చాయి. సంక్రాంతికి రిలీజయ్యే కొత్త సినిమాల విషయమై ఈ రెండు అంశాల్లోనూ ప్రభావం గట్టిగానే ఉండొచ్చనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?

(ఇదీ చదవండి: దేవరకొండ ఫ్యామిలీతో 'పుష్ప 2' చూసిన రష్మిక)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)