Breaking News

'మిరాయ్‌' ది సూపర్‌ యోధ విడుదలపై ప్రకటన

Published on Sat, 02/22/2025 - 12:01

గత ఏడాదిలో విడుదలైన 'హనుమాన్‌' సినిమాతో హీరో తేజ సజ్జా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన తర్వాతి సినిమా 'మిరాయ్‌' పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్‌, పోస్టర్స్‌ ప్రేక్షకులను మెప్పించాయి. దీంతో ఈ సినిమా విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మేకర్స్‌ గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఈ క్రమంలో మిరాయ్‌ విడుదల తేదీని వారు ప్రకటించారు.

'మిరాయ్‌' ది సూపర్‌ యోధ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తేజ సజ్జా యోధుడిగా కనిపించనున్నారు. కార్తిక్‌ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ణు నిర్మిస్తోంది. తెలుగుతోపాటు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో 2025 ఆగష్టు 1న 2D, 3D ఫార్మెట్‌లో ఈ మూవీని విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. రక్షా బంధన్, ఇండిపెండెన్స్ డేను టార్గెట్‌ చేస్తూ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఇందులో రితిక నాయక్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మంచు మనోజ్‌ విలన్‌ పాత్ర పోషిస్తున్నారు.  ఈ చిత్రం ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఫాంటసీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఉండనుంది. మిరాయ్‌ అనేది అశోకుని కాలంలో రహస్యమైన ఓ శాసనం అని గతంలో డైరెక్టర్‌ కార్తిక్‌ చెప్పారు. దీని గురించి సినిమా విడుదల తర్వాత పూర్తిగా అందరికీ అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)